
వీడియోకాన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలు
దేశీ ప్రముఖ కన్సూమర్ డ్యూరబుల్, హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ వీడి యోకాన్ తాజాగా తొలి 5 స్టార్ రేటింగ్ ఇన్వర్టర్ ఏసీలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
హైదరాబాద్: దేశీ ప్రముఖ కన్సూమర్ డ్యూరబుల్, హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ వీడి యోకాన్ తాజాగా తొలి 5 స్టార్ రేటింగ్ ఇన్వర్టర్ ఏసీలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అధిక ఇంధన సామర్థ్యం వీటి ప్రత్యేకతని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 1 టన్ను, 1.5 టన్ను వేరియంట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త పెంటా ఇన్వర్టర్ ఏసీ ఉత్పత్తుల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏసీ మార్కెట్‌లో 15 శాతం వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వీడియోకాన్ ఏసీ డివిజన్ సీవోవో సంజీవ్ బక్షి పేర్కొన్నారు. వినియోగదారులకు పెంటా ఇన్వర్టర్ ఏసీలు ఫిబ్రవరి నెల చివరి నాటికి అందుబాటులో ఉంటాయని వీడియోకాన్ టెక్నాలజీ, ఇన్నొవేషన్ హెడ్ అక్షయ్ దత్ ప్రకటనలో తెలిపారు. 1 టన్ను ఏసీ ధర రూ.39,000 కాగా, 1.5 టన్నుల ఏసీ ధర రూ.47,000.