దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో బంగారం ధర సోమవారం పరిమిత శ్రేణిలో కదలుతోంది. నేటి ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం రూ.70 స్వల్ప నష్టంతో రూ.48897 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నష్టాల్లో కదులుతుండటం, దేశీయంగా ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం ఎంసీఎక్స్‌లో బంగారం పరిమిత శ్రేణి ట్రేడింగ్‌కు కారణమైందని బులియన్ పండితులు చెబుతున్నారు.
‘‘బంగారం రూ.49000 స్థాయి వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుంది. మరికొంతకాలం పాటు ఇదే రూ.49వేల దిగువున ట్రేడైతే.., తదుపరి అమ్మకాల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. డౌన్‌ట్రెండ్‌లో రూ.48,750-48,50 శ్రేణిలో కీలక మద్దతుస్థాయి ఉంటుంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అధికారి శ్రీరాం ఐయ్యర్ తెలిపారు.
అంతర్జాతీయంగా స్వల్పనష్టాల్లో:
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం ధర 3డాలర్ల నష్టంతో 1,807 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ బలహీనత, పెరుగుతున్న కరోనా కేసులు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారానికి కీలక మద్దతు 1800 డాలర్ల స్థాయిని కోల్పోకుండా కాపాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment