రాయలసీమ మురిసిపడింది | Stupendous response to YS Jagan prajasankalpayatra in rayalaseema | Sakshi
Sakshi News home page

రాయలసీమ మురిసిపడింది

Published Mon, Jan 22 2018 7:25 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

Stupendous response to YS Jagan prajasankalpayatra in rayalaseema - Sakshi

సాక్షి, చిత్తూరు : అవ్వతాతలకు మనవడిగా.. అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అండగా.. రైతుల సమస్యలపై పోరాడే రాజన్న అంశగా.. అణగారిన కులాల పక్షాన పోరాడే ఆశాదీపంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఒక మహా ప్రస్థానం మొదలైంది. వెన్నుపోట్లను, నమ్మక ద్రోహాన్ని, దగాకోరు పాలనను దాటుకుని ప్రజాసంకల్పయాత్ర (మంగళవారం ఉదయం) రాయలసీమను దాటనుంది.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవినీతి, దగాకోరు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో భాగంగా నవంబర్‌ 6న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పూర్తి చేసుకోనుంది. పదమూడు జిల్లాల్లో చేయదలిచిన ప్రజా సంకల్పయాత్ర మూడో వంతు పూర్తయింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్లకు పైగా  చేయాలని నిర్ణయించిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరువైంది.

విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు తమకు జరుగుతున్న మోసం గురించి చెప్పుకోవడానికి కరువు సీమలో పర్యటిస్తున్న తమ అభిమాన నాయకుడికి ఎదురేగి స్వాగతం పలికారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓటేయడం దగ్గర్నుంచి నాలుగేళ్లుగా మాయదారి ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను జననేత వద్ద కన్నీళ్లతో చెప్పుకున్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు, అర్హతలుండీ పింఛన్లు పొందలేకపోవడం, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ గొండితనం, అభివృద్ధి పేరిట అడ్డగోలు భూ దోపిడీ, అధికారమే అండగా టీడీపీ నాయకుల గూండాయిజం, మహిళలపై వేధింపులు.. ఇలా తన దృష్టికొచ్చిన ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు.

పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అక్షరబద్దం చేస్తూ తన అనుభవాలను డైరీ రూపంలో అక్షరబద్దం చేస్తున్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాయలసీమలో ఉపాధి దొరక్క పక్క రాష్ట్రాలకు వలసపోతున్న రైతు కూలీల పక్షాన నిలిచేందుకు రైతులతో ముఖామఖి నిర్వహించారు. మహిళల కోసం మహిళా సదస్సులు ఏర్పాటు చేసి మరీ వారి సమస్యలను సావధానంగా విన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇస్తూ తనను కలిసిన వారికి భరోసా కల్పిస్తున్నారు. కడప జిల్లాలో పాదయాత్ర సందర్భంగా తనను కలిసిన ఫాతిమా కాలేజీ విద్యార్థులకు అండగా నిలిచారు. వెంటనే పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని పంపించి కేంద్ర మంత్రికి విన్నవించడంతో పాటు తాను కూడా స్వయంగా లేఖ రాశారు.

ఒకవైపు పాదయాత్ర చేస్తూనే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. విజయవాడలో బోటు ప్రమాదం జరిగినప్పుడు పార్టీ నాయకులను పంపించి బాధితులకు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే సమీక్షలు నిర్వహించారు. ఏ రోజుకారోజు పాదయాత్రలో తాను చూస్తున్న సమస్యలను, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారు.

చంద్రన్న మాల్స్, ఫైబర్‌ గ్రిడ్‌ల పేరిట చేస్తున్న దగాను ప్రజా క్షేత్రం నుంచే ప్రశ్నిస్తున్నారు. ఈడీ బయటపెట్టిన లిస్టంటూ విషం కక్కుతున్న టీడీపీ అనుకూల మీడియా రాతలపై వెంటనే స్పందించారు. తనకు విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి ఉన్నట్టు నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలుగుతానని బహిరంగ సవాల్‌ విసిరారు. పాదయాత్ర నుంచే వైఎస్‌ జగన్‌ చేసిన సవాల్‌ను స్వీకరించలేక టీడీపీ తోక ముడిచింది.

ప్లీనరీ సందర్భంగా ప్రటకించిన నవరత్నాలు
ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన నవరత్నాలను ప్రచారం చేయడంతోపాటు పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలపై ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. వీలును బట్టి అక్కడికక్కడే పథకాల రూపకల్పన చేయడం విశేషం. టీడీపీ మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించడం ప్రస్తావిస్తూనే ప్రజల సహకారంతో రాబోయే ఎన్నికల కోసం కేవలం రెండు పేజీల్లోనే ప్రజలు దిద్దిన మేనిఫెస్టో తయారు చేస్తామని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయి ప్రక్షాళన
వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి
దేశంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ అమలు
దీర్ఘకాలిక వ్యాధులకు పింఛన్లు.
కూలీలు రోడ్డు ప్రమాదాలు, వ్యాధులతో మంచం పడితే ఆర్థిక చేయూత
దశలవారీగా  మద్యపాన నిషేధం అమలు
అమ్మఒడి పథకం కింద చిన్నారుల చదువులకు ఆర్థిక చేయూత
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నెలకు రూ. 500 స్కాలర్‌షిప్‌
ఐదు నుంచి పదో తరగతి వరకు రూ. 750
ఇంటర్, డిగ్రీ, పీజీ చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతోపాటు ఏడాదికి రూ. 20 పంపిణీ
జలయజ్ఞం కింద పెండింగ్‌లో ఉన్న అన్ని సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి
పింఛన్లు వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెంపు
పింఛను వయసు 45 వేలకు తగ్గింపు
పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం..
రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్లు నిర్మాణానికి కృషి
మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు
వ్యవ‘సాయం’ కింద రైతులకు ప్రతి ఏడాది మే నెలలో రూ. 12,500 పంపిణీ

పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలు
 ప్రతి మండలానికి కోల్డ్‌ స్టోరేజీ
 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
1000 రూపాయలు దాటిన ప్రతి చికిత్స ఆరోగ్య శ్రీ పరిధిలోకి
అనంతపూర్, కర్నూలు జిల్లాల నుంచి బోయ, వాల్మీకి కులాల నుంచి ఒకరికి ఎంపీ సీటు
ఎన్నికలకు ముందే బీసీ కులాలన్నింటితో బీసీ గర్జన. ఆ మహాసభలో బీసీ డిక్లరేషన్‌ – బీసీ సబ్‌ ప్లాన్‌ తీసుకొచ్చేందుకు ప్రణాళిక
మైనారిటీలకు సబ్‌ ప్లాన్‌
ఇమామ్‌ల జీతాలు 5 వేల నుంచి 10 వేలకు పెంపు, మోజన్‌లకు 3 వేల నుంచి 5 వేలకు పెంపు
రాష్ట్రంలో ఉన్న అన్ని మసీదులు, చర్చిలు, ఆలయాలకు ప్రతినెలా నిర్వహణ ఖర్చులు.  
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం
ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించడం
చిత్తూరు, కర్నూలు జిల్లా ఆర్మూరులో టమోట జ్యూస్‌ ఫ్యాక్టరీ
పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు లీటరు పాలకు రూ. 4 మద్ధతు ధర
పింఛన్‌ వయసు 45 ఏళ్లకు కుదింపు
పింఛను వెయ్యి నుంచి రెండు వేలకు పెంపు
రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ
ఉద్యోగ విప్లవం తెచ్చేందుకు లక్షా 50 వేల ఉద్యోగాలు
ఏటా డీఎస్సీ ప్రకటన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగభృతి వంటి అన్ని సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం
అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతి ఎంపీ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటు
అధికారంలోకి రాగానే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
మూసేసిన చక్కెర ఫ్యాక్టరీల పునఃప్రారంభం
చేనేతలకు ఉపాధి కల్పించేలా ఆర్థిక చేయూత
ఎస్సీల సమస్యలపై అధ్యయన కమిటీ. పాదయాత్ర ముగిసిన వెంటనే ఎస్సీ గర్జన. అధ్యయన కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం.
నాపరాయి పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలు తగ్గింపు
డోన్‌ నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ చేసి ఉచితంగా బోర్ల ఏర్పాటు.

వైఎస్‌ఆర్‌ జిల్లాలో పాదయాత్ర
నవంబర్‌ 6న ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి మొదలైన పాదయాత్ర మొత్తం ఏడు రోజుల పాటు 93.8 కిమీలు జరిగింది. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు, ఫాతిమా కాలేజీ విద్యార్థినులకు భరోసా, ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్, మోకాళ్ల మార్పిడిని ఆరోగ్యశ్రీలోకి చేరుస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నుంచి ఫిరాయించి మంత్రి పదవిలో కొనసాగుతున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి సొంత నియోజకవర్గంలో జమ్మలమడుగులో పాదయాత్రకు జనం నీరాజనాలకు పట్టారు.

కర్నూలు జిల్లాలో పాదయాత్ర
వైయస్‌ జగన్‌ నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలోని ప్రధాన ఘట్టాలన్నీ కర్నూలు జిల్లా వేదికగానే జరిగాయి. నవంబర్‌ 4వ తేదీ నుంచి మొదలైన పాదయాత్ర డిసెంబర్‌ 3వ తేదీ వరకు 18 రోజుల పాటు సాగింది. వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి చాగలమ్రరి మండలం వద్ద కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. మొత్తం 7 నియోజకవర్గాలు 14 మండలాలు 66 గ్రామాల్లో మొత్తం 263 కిమీల మేర పాదయాత్ర సాగింది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగింది.

చాగలమ్రరి మండంలం గొడిగనూరు వద్ద 100 కిమీలు పూర్తి చేసుకున్నారు.
200 కిమీలు బేతంచర్ల మండలం ముద్దవరంలో పూర్తి చేశారు
300 ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల వద్ద 300 కిమీలు పూర్తి చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ–నీవా నుంచి దద్దనాల చెరువుకు నీరందిస్తామని చెప్పారు. విద్యుత్‌ చార్జీలు, రాయల్టీ పెంపు వల్ల మూత పడిన క్వారీలను ఆదుకోవడంతోపాటు రోడ్డున పడిన కూలీలకు అండగా ఉంటామన్నారు.
నాపరాయి పరిశ్రమలుకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు.
డోన్‌ను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.
పెండింగ్‌లో ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు హామీ. రాజోలి, జొలదరిసి రిజర్వాయర్ల నిర్మాణం

అనంతపురం జిల్లాలో పాదయాత్ర
డిసెంబర్‌ 4న అనంతపురం జిల్లాలో మొదలైన పాదయాత్ర మొత్తం 9 నియోజకవర్గాల పరిధిలో 176 గ్రామాల్లో జరిగింది. మొత్తం ఎనిమిది బహిరంగ సభలు, 4 సదస్సులు నిర్వహించారు. జిల్లాలోని గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు.
శింగనమల నియోజకవర్గం గుమ్మెపల్లిలో 400 కిమీలు
ధర్మవరం నియోజకవర్గం గొట్లూరులో 500 కిమీలు
కదిరి నియోజకవర్గం కటారిపల్లిలో 600 కిమీల మైలురాయిని పూర్తి చేసుకుంది.
జిల్లాలోని గుత్తి, పెద్దవడుగూరు, తరిమెల, కూడేరు, పాపంపేట, రాప్తాడు, నల్లమాడ, కదిరి పట్టణాల్లో నిర్వహించిన బహిరంగసభలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొత్తం నాలుగు చోట్ల సదస్సులు నిర్వహించారు.
గార్లదిన్నెలో బీసీ సదస్సు, వడ్డుపల్లెలో మైనార్టి సదస్సు, మారాలలో రైతు సదస్సు, ధనియాని చెరువులో మహిళా సదస్సు జరిగింది.

చిత్తూరు జిల్లా ప్రజాసంకల్పయాత్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోకి ప్రవేశించిన తంబళ్లపల్లి నుంచి సత్యవేడు వరకు జనసందోహం అనూహ్యంగా కనిపించింది. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి వైఎస్‌ జగన్‌ అభ్యర్థిని ప్రకటించారు. మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళిని చంద్రబాబు మీద పోటీకి నిలబెడుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌ 28న చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం ఎద్దులవారి కోట గ్రామంలోకి ప్రవేశించింది. జిల్లాలో అత్యధికంగా పది నియోజకవర్గాలో పాదయాత్ర సాగింది. జిల్లాలో 46 రోజు మొదలైన పాదయాత్ర సుదీర్ఘంగా 22 రోజులపాటు జరిగి 69వ రోజు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.
జిల్లాలో 700 కిమీలను పీలేరు నియోజవర్గం చింతపర్తి శివారులో
800 కిమీలు, గంగాధరనెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లిలో..
900 కిమీల మైలురాయిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెర్లోపల్లి హరిజనవాడలో  పూర్తిచేశారు. పీలేరు, తంబళ్లపల్లి, పుంగనూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, శ్రీకాళహస్తి, నగిరి, చంద్రగిరి, మదనపల్లి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర జరిగింది.

- (కాలేషా వలీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement