భోపాల్: మధ్యప్రదేశ్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సెహోర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment