అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు (ఫైల్ ఫోటో)
సాక్షి, విశాఖపట్నం: ‘మేం ముగ్గురం చనిపోతున్నాం.. మాకోసం వెతకొద్దు’ అని తల్లికి మేసేజ్ పెట్టి ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన వైజాగ్‌లో స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు యువతులు సోమవారం రాత్రి ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ద్వారకనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్న క్రమంలో యువతులు తాము చెన్నైలో క్షేమంగా ఉన్నట్లు తల్లికి మేసేజ్ పెట్టారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపి తన బిడ్డలను క్షేమంగా తీసుకురావాలని పోలీసులను వేడుకుంది.
ఇక ముగ్గురు యువతులు ఇల్లు వదిలి వెళ్లడానికి గల కారణాలేంటి, చెన్నైకి ఎందుకు వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అదృశ్యమై ఈ ముగ్గురు యువతులు మింది అనురాధ, మింది తులసి, మింది కోమలిలు సొంత అక్కాచెల్లెళ్లు. వీరు ద్వారకనగర్‌లో సాయినంద అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఎర్రం నాయుడు కుమార్తెలు. సోమవారం రాత్రి అదృశ్యమైన వీరి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment