ప్రముఖ నటికి లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్‌ | actress amala paul sexually harrassed | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటికి లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్‌

Published Wed, Jan 31 2018 8:26 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

actress amala paul sexually harrassed - Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్‌ లైంగిక వేధింపుల బారిన పడ్డారు. వ్యాపారవేత్త అలగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెన్నైలోని పాండిబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అలగేశన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు సమాజంలో భద్రత లేదని అన్నారు.

మాటలతో చేతలతో మహిళలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనను వేధించిన అలగేశన్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో కోరారు. నటిగా ఉన్న తనకే ఇలాంటి వేధింపులు ఎదురైతే.. సామాన్య మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశముందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement