ప్రతీకాత్మక చిత్రం
‘‘ఏ చాయ్ చటుక్కునా తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’’ అంటూ ఓ సినీ కవి తేనీటి గొప్పతనాన్ని వివరించాడు. టీ నిత్య జీవితంలో భాగమైపోయింది. టీ తాగనిదే చాలామం దికి దినచర్య కూడా ప్రారం భం కాదు. అలసటగా ఉన్నప్పుడు ఉత్సాహం కోసం టీ తాగుతుంటారు. తలనొప్పిగా అనిపించినా ఉపశమనం కోసం తేనీరే తీసుకుంటారు.
ఇద్దరు మిత్రులు కలిసినా.. బంధువుల ఇంటికి వెళ్లినా.. ముందుగా ఆఫర్ చేసేది టీనే.. కానీ ఉత్తేజాన్నిస్తుందని భావించే టీలో ఉపయోగించే పొడిని కూడా కొందరు కల్తీ చేసేస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన టీ పొడిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
సాక్షి, కామారెడ్డి : స్నేహితుడు కలిస్తే చాలు ‘ఓ చాయ్ కొడదాం పదా’ అంటాం. మనసు చికాకు గా ఉన్నా, తలనొప్పి అనిపించినా చాలు ఓ చాయ్ తాగాలనుకుంటాం. పేద గొప్ప తేడా లేకుండా టీ తాగుతుంటారు. సమీపంలోని హోటల్‌కు వెళ్లి చాయ్ లాగించేస్తారు. కానీ చాయ్ తాగడమే తప్ప చాయ్ తయారీలో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారో ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మా ట్లాడుతూ చాయ్ తాగడం, డబ్బులు ఇచ్చి వెళ్లిపోవడం.. అంతే.. దీన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ చాయ్‌పత్తి అమ్మకాలతో జేబు లు నింపుకుంటున్నారు.
చాయ్ తయారు చేసేవా రు సైతం తక్కువ ధరలో పత్తి దొరుకుతుంది కదా అని కొంటూ చాయ్ తయారు చేసి అమ్ముకుంటున్నారు. చాయ్‌పత్తి మంచిదా, చెడ్డదా అన్నది చూ డడం లేదు. తక్కువ ధర.. ఆపై కొద్దిపాటి పత్తి వే స్తే చాలు చాయ్ మంచి రంగు వస్తుండడంతో దీని కొనుగోలుకే చాలా హోటళ్ల నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కల్తీ చాయ్‌పత్తీతో తయా రు చేసిన చాయ్ తాగడం వల్ల కలిగే అనర్థాలు అప్పుడే కనిపించవు. పైగా చాయ్‌తోనే సమస్య వచ్చిందని ఎవరూ అంచనా వేసే ప్రయత్నం కూడా చేయరు.
రాష్ట్ర రాజధానినుంచి..
కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిత్యం హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో కల్తీ చాయ్‌పత్తి తరలివస్తోంది. కవర్లలో ప్యాక్ చేసి తీసుకువచ్చి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో రెండు, పాత బస్టాండ్ ప్రాంతంలో రెండు హోటళ్లకు నిత్యం చాయ్‌పత్తి వస్తున్నట్టు తె లుస్తోంది. అలాగే జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌కు కూడా చా య్‌పత్తీని తరలిస్తున్నారని సమాచారం.
హైదరాబాద్‌లో తయారై న చాయ్‌పత్తిని మారుతి వ్యాన్లు, కార్లు, ఆటోలతో పాటు బైక్‌లపై రకరకాల మార్గాల ద్వారా సరఫ రా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో కుళ్లా చాయ్‌పత్తి కిలోకు రూ.200–240 వరకు విక్రయిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి వస్తున్న చాయ్‌పత్తి మాత్రం కిలోకు రూ.120 నుంచి రూ.140కి అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
రసాయనాలతో తయారీ..
కొన్ని హోటళ్లకు సరఫరా అవుతున్న చాయ్‌పత్తి త యారీలో రసాయనాలు వాడుతున్నట్టు తెలుస్తోంది. చేతిలో కొంత చాయ్‌పత్తిని తీసుకుని నీళ్లలో వే యగానే ఒక్కసారిగా చాయ్ రంగు వస్తోంది. పై గా ఆయిల్‌రూపంలో పైన పేరుతోంది. సాధార ణంగా చాయ్‌పత్తిని నీటిలో మరిగిస్తేగాని పత్తీ కరగదు, రంగులోకి రాదు. కానీ కల్తీ చాయ్‌పత్తి మా త్రం క్షణాల్లో రంగులోకి వస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. చాయ్ రుచి వచ్చేలా కూడా రసాయనాలు వాడుతున్నట్లు తెలుస్తోంది.
నిఘా కరువు..
జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాం తాలకు సరఫరా అవుతున్న కల్తీ చాయ్‌పత్తి విషయంలో అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రసాయనాలతో తయారైన చాయ్‌పత్తి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అధికారులు స్పందించి కల్తీ చాయ్‌పత్తి సరఫరాను అరికట్టాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment