
బెంగళూరు : కర్ణాటకలో ఓ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడారు. తను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఊరి వేసుకుని తనువు చాలించారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియారాలేదు. వివరాల్లోకి వెళ్తే.. నయాజ్ ఖాన్ బెంగళూరులోని ఓ లోకల్ టీవీ చానల్‌లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే అతడు బుధవారం కేఆర్ పురంలోని తన సొంత ఇంట్లో శవమై కనిపించాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment