
సాక్షి, నాగర్‌కర్నూల్: హైదరాబాద్- శ్రీశైలం దారిలో నాగర్ కర్నూల్ జిల్లా వటవర్ల పల్లి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఐదు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. అక్క మహాదేవి గుహల సముదాయంలో పుర్రెలు, ఎముకలు, నిమ్మకాయలు, దుస్తులు, చెప్పులు ఉన్నట్లు పశువుల కాపరులు ఐదు రోజుల క్రితం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కపాలాలు 30 ఏళ్లలోపు మహిళలవని, వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రాంతంలో భారీగా గుప్త నిధుల ఉన్నాయని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మహిళలను బలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం గుప్త నిధులు, తాంత్రిక శక్తుల కోసమే వారికి మత్తు మందులు ఇచ్చి బ్లేడులతో కోసి బలి ఇచ్చి ఉంటారని... మృతదేహాలను జంతువులు తినేయగా పుర్రెలు మాత్రమే మిగిలాయని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. దట్టమైన అడవిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పర్యాటకులు అటుగా వెళ్లేందుకు వణికి పోతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment