బ్లేడ్ బ్యాచ్ దాడిలో గాయాల పాలైన లారీ డ్రైవర్ వెంకటేష్
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : నగరంలో బ్లేడ్ బ్యాచ్ దారుణాలు పెరిగిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన యువకులు ప్రజలపై దాడులు చేసి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో సంఘటన ఆదివారం ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీతానగరానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేష్, క్లీనర్ ప్రసాద్ లక్ష్మి రుద్ర ట్రాన్స్ పోర్టులో పనిచేస్తున్నారు. వారు ఆదివారం పంగిడి నుంచి మద్యం మత్తులో హైవే పై వెళ్తున్న లోడు లారీకి అడ్డుగా నలబడి హారన్ కొట్టినా తప్పుకోకుండా డ్రైవర్ బ్రేకులు వేసిన తరువాత లారీ డ్రైవర్, క్లీనర్‌లను క్యాబిన్‌లో నుంచి బయటకు లాగి దాడి వారి వద్ద ఉన్న నగదు చోరీ చేసి పరారైయ్యారు. సీతానగరానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేష్, క్లీనర్ ప్రసాద్ లక్ష్మి రుద్ర ట్రాన్స్‌పోర్టులో పని చేస్తున్నారు. వారు ఆదివారం పంగిడి నుంచి సట్రు (క్వారీలో వచ్చే నల్లరాతి బూడిద)ను బొమ్మూరు తీసుకువెళ్తున్నారు.
హైవేపై బ్రెస్ట్ ప్రైస్ ఉన్న ప్రదేశంలో దానికి ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు నుంచి తొమ్మిది మంది బ్లేడ్ బ్యాచ్ యువకులు రోడ్డుకు అడ్డుగా నడిచి వెళ్తుండగా లారీ డ్రైవర్ హారన్ కొట్టాడు. అప్పటికీ వారు తప్పుకోకుండా రోడ్డుకు అడ్డుగా నిలబడ్డారు. దాంతో చేసేది లేక డ్రైవర్ లారీని రోడ్డుపై ఆపాడు. వారు రాళ్లతో లారీపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. లారీ డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి కిందకు లాగి ‘మేము రోడ్డు దాటుతుండగా లారీని ఆపడం మాని హారన్ కొడతావా?’ అంటూ డ్రైవర్ వెంకటేష్‌పై దాడి చేశారు. అడ్డు వచ్చిన క్లీనర్‌పై కూడా దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ, 50 వేలు లాక్కుని పరారయ్యారు. గాయపడిన లారీ డ్రైవర్ వెంకటేష్, క్లీనర్ ప్రసాద్‌లను స్థానికులు చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment