
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పండక్కు వచ్చిన మనవడికి బిస్కెట్లు కొనేందుకు దుకాణానికి వెళుతుండగా బొగ్గు లోడుతో వెళుతున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో జగదీష్(10) అనే బాలుడు అక్కడికక్కడే మతిచెందగా బాలుడి తాత గాంధీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
గాంధీరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మనవడు బిస్కెట్ కావాలనడంతో గాంధీరెడ్డి మనవడిని తోడ్కొని అంగడికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో టిప్పర్‌ను ధ్వంసంచేయడమేకాక రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. జనాన్ని చూసిన డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment