సొంత అన్నే కామాంధుడయ్యాడు | Brother Forced Own Sister Badly In Anantapur | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 18 2018 12:06 PM | Last Updated on Sat, Aug 18 2018 12:13 PM

Brother Forced Own Sister Badly In Anantapur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పదేళ్ల క్రితం తల్లి మరణించింది. అప్పటికి ఆ బాలిక వయస్సు నాలుగేళ్లు. తండ్రి.. అన్న.. వీళ్లే లోకం. బిడ్డగా.. చెల్లిగా.. ప్రేమానురాగాలను పంచిపెట్టింది. తోడూనీడగా నిలవాల్సిన సోదరుడే కీచకుడయ్యాడు. ఏడాదిన్నర కాలంగా నరకం చూపించాడు. ఎవరికైనా చెబితే చంపుతానన్నాడు. కడుపు చేశాడు. ఆ భయాన్ని ‘కడుపులోనే దాచుకుంది’. గురువారం రాత్రి పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో సభ్యసమాజం తలదించుకుంది. ఆ బాలిక దీనావస్థకు మౌనంగా రోదిస్తోంది.  

సాక్షి, అనంతపురం: అండగా ఉండాల్సిన సోదరుడే కామంతో కళ్లుమూసుకునిపోయి చెల్లిని చెరబట్టాడు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న కామ వాంఛకు బలైన ఓ బాలిక గర్భం దాల్చి ప్రసవానికి ఆస్పత్రికి వస్తేగాని విషయం బయట పడలేదు. అనంతపురం పట్టణ శివారులోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక(14) గురువారం పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పాఠశాల విద్యార్థిలా ఉండటంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆరా తీయగా వెంట వచ్చిన తండ్రి పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

వైద్య పరీక్షల్లో శిశువు గర్భంలోనే మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించి వెంటనే మృతశిశువును బయటకు తీసి బాలిక ప్రాణాలకు ముప్పు లేకుండా చూశారు. అయితే బాలిక ప్రసవం విషయం తెలిసి ప్రభుత్వాసుపత్రికి పోలీసులు వచ్చి విచారించారు. ఆ విచారణలో అన్న(20) అకృత్యం బయటపడింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి పదేళ్ల క్రితమే మరణించింది. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న ఆన్న ఏడాదిన్నర క్రితం నుంచి సోదరిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. పాఠశాలకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకునేవాడని బాధితురాలు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైంది. తండ్రికి చెబితే చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక అన్న అఘాయిత్యాన్ని మౌనంగా భరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement