
సాక్షి, అనంతపురం: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ అమానుష సంఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురం జిల్లా కూడేరుకు చెందిన బాలిక నగరంలోని జూనియర్ కాలేజీలో చదువుతోంది. అదే ఊరికి చెందిన గణేష్ అనే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
అమ్మాయి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కూడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టాడు. ఇంతలో గణేష్ బాలికను అనంతపురంలో విడిచిపెట్టి వెళ్లాడని సమాచారం. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గణేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలికను వైద్య చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment