బాలికకు లైంగిక వేధింపులు | Molestation On GirlIn Anantapur | Sakshi
Sakshi News home page

బాలికకు లైంగిక వేధింపులు

Published Tue, Jul 3 2018 8:50 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

Molestation On GirlIn Anantapur - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బాలకృష్ణ

గుంతకల్లు రూరల్‌: ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం మేరకు.. వై.టి.చెరువు గ్రామ శివారులో ఓ నిరుపేద కుటుంబం నివాసం ఉంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్న నాలుగేళ్ల కుమార్తెకు పెద్దకుమార్తె(మైనర్‌)ను ఇంటివద్ద కాపలాగా ఉంచి తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లేవారు. వీరి ఇంటి సమీపంలోనే గడ్డివామి వేసుకున్న బాలకృష్ణ అనే వ్యక్తికి మైనర్‌ బాలికపై కన్నుపడింది.

ఇంటి పనులు చేసుకునేటపుడు, బయటకు వెళ్లినపుడు, పాఠశాలకు వెళ్లి వచ్చేటపుడు బాలికను అనుసరిస్తూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు మూడు రోజుల క్రితం గుంతకల్లు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోయింది. చివరకు బాలిక తల్లిదండ్రులు సోమవారం ఉదయం డీఎస్పీ శ్రీధర్‌రావుకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement