
మాట్లాడుతున్న సీపీ మహేష్‌భగవత్ నిందితుడు షేక్ సయ్యద్
నాగోలు: యజమాని డబ్బును దొంగిలించి పరారైన కారు డ్రైవర్‌ను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్దనుంచి రూ.10.53 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కొండయ్య హార్డ్‌వేర్ బిజినెస్ చేస్తున్నాడు.గత 6 నెలల క్రితం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం కొంపల్లి చెందిన షైక్ సయ్యద్(27)ని తన కారు డ్రైవర్‌గా నియమించాడు.
కొండయ్య వ్యాపారం నిమిత్తం తరుచుగా నగరానికి వస్తుంటాడు. ఈ నెల 7న కొండయ్య హైదరాబాద్‌లో స్థలం కొనేందుకు డబ్బులు తీసుకొని వస్తున్న సమయంలో హయత్‌నగర్ భాగ్యలత లోని ఓక కంటి హాస్పటల్ వద్ద అగాడు. తన వద్ద ఉన్న రూ.11లక్షల నగదును డ్రైవర్ పై నమ్మకంతో కారులోనే ఉంచి హాస్పటల్ లోపలికి వెళ్లాడు. కొండయ్య హాస్పటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకొని తిరిగి వచ్చి చూసేటప్పటికి డ్రైవర్, డబ్బు కనిపించలేదు. దీంతోఅతను డ్రైవర్‌పై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. పోలీసులు డ్రైవర్ సయ్యాద్‌ను సరూర్‌నగర్‌లో అరెస్టు చేసి అతని వద్దనుంచి రూ. 10.53 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ నాగరాజు.వనస్ధలిపురం ఏసీపీ గాంధీనారాయణ, హయత్‌నగర్ సీఐ సతీష్ ,డిఐ జితేందర్‌రెడ్డి, డిఎస్‌ఐ నర్సింహా, క్రైమ్ టీం శ్రీనివాస్, ప్రభుచరణ్, శ్రీనివాస్, శాంతి స్వరుప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment