ఈడీ విచారణకు చందా కొచ్చర్‌ హాజరు | Chanda Kochhar, Questioned Till 4 AM | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు హాజరైన చందా కొచ్చర్‌

Mar 2 2019 1:10 PM | Updated on Mar 2 2019 2:20 PM

Chanda Kochhar, Questioned Till 4 AM - Sakshi

ముంబై : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌ శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. కాగా ఈడీ విచారణకు చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ కూడా హాజరయ్యారు. ప్రయివేట్‌ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్‌పై ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్‌ కుట్ర ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీడియోకాన్‌ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో  దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ... చందా కొచర్‌తో పాటు వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ నివాసాల్లో నిన్న ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈడీ విచారణ అనంతరం చందా కొచ్చర్‌ ఇవాళ మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయినా... ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌ ధూత్‌ మాత్రం ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement