పెన్షన్‌ పేరుతో వృద్ధులకు బురిడీ | Chen Snechar Thefts Arrested In Prakasam | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ పేరుతో వృద్ధులకు బురిడీ

Published Mon, Aug 27 2018 9:14 AM | Last Updated on Mon, Aug 27 2018 9:14 AM

Chen Snechar Thefts Arrested In Prakasam - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సత్యఏసుబాబు

ఒంగోలు (ప్రకాశం): వృద్ధులను టార్గెట్‌ చేస్తూ వారి మెడలోని చైన్‌లను కాజేస్తున్న ఘటనలు మన జిల్లాలోను 5 చోటు చేసుకోగా కందుకూరు సీఐగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు ఎట్టకేలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐటీ కోర్‌ టీం సురేష్‌ సాయంతో నిందితుడ్ని గుర్తించి కటకటాలు లెక్కించేలా చేశాడు.

నిందితుడిని గుర్తించింది ఇలా:
నెల్లూరు జిల్లా దుత్తలూరు ప్రాంతానికి చెందిన కొండెపోగు జీవరత్నం అలియాస్‌ జీవా ఆర్‌కే బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇతని బాబాయి కన్నుమూయడంతో తన పిన్నమ్మతోపాటు వారి ఆరుగురు సంతానాన్ని పోషించేందుకు ఆర్థిక భారం తోడు కావడంతో  నేర ప్రవృత్తివైపు దృష్టి సారించా డు. ఒకసారి తన అమ్మమ్మను పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అధికారులు మెడలో బంగారు చైన్‌ ఉంటే డబ్బున్న మనుషులని భావించి పెన్షన్‌ రాదని, కనుక మెడలోని బంగారు చైన్‌ తీసేయమంటూ సూచించారు. ఈ విషయం అతని మెదడులో వృద్ధులను సులువుగా టార్గెట్‌ చేయవచ్చనే భా వన కలిగించింది.

ఈ క్రమంలో  మెడలో బంగారం వేసుకుని ఉన్న వృద్ధ మహిళలను  గుర్తించి వారి వద్దకు వెళ్లి మీకు పెన్షన్‌ మంజూరైంది. మీరు ఫోటో దిగాలి అని కొంత మందిని, మీకు పెన్షన్‌ పెరిగింది. దీనికి మరలా ఫోటో తీయించుకోవాలంటూ చెప్పేవా డు. వారు ఫోటో దిగే సమయంలో మెడలో చైన్‌ ఉం టే రుణం రద్దు అవుతుందని చెప్పి వారి చేత తీ యించి పక్కనే ఉంచేలా చేసి తనకు ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు నకలు కావాలంటూ హడావుడి చేసి వారిని బయటకు పంపడం, లేదా ఇంట్లోకి వెళ్లి వారు వెతికే క్రమంలో బంగారు చైన్‌తో ఉడాయిం చడం జీవరత్నం అలవాటుగా మారింది.
 
అప్పట్లో సంచలనం
 ఒంగోలు టూటౌన్‌ పరిధిలో పెన్షన్‌ పెరిగిందంటూ వృద్ధురాలిని మోసం చేసిన కేసు అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఈ తరహా నేరాలు జిల్లాలో కందుకూరులో 2, టంగుటూరు–1, కనిగిరి–1  వెరసీ మొత్తం 5 చోట్ల చేసుకున్నాయి. ఇటీవలే కందుకూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ కె.వెంకటేశ్వరరావు ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాడు. జిల్లాతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో నేరస్థలం ఏదైతే ఉందో ఆ ప్రాంత పరిధిలో సంబంధిత ప్రాంత పోలీసుల ద్వారా సెల్‌టవర్ల ద్వారా వివరాలు సేకరించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఐటీ కోర్‌టీం సురేష్‌ ప్రత్యేక దృష్టి సారించి అన్ని చోట్ల కామన్‌గా వస్తున్న సెల్‌ నంబర్‌లను గుర్తించే పనిలో పడ్డాడు. తీరా అన్నింటిలోనూ ఒకే ఒక నంబర్‌ కనిపిస్తుండడంతో అతనే నేరస్తుడు అయి ఉంటాడని దృష్టి సారించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాడు.
 
వృద్ధులే అతని టార్గెట్‌:
కొండెపోగు జీవరత్నంను తమ సిబ్బంది విచారిస్తే మొత్తం 21 కేసుల్లో నిందితుడిగా అంగీకరించాడని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. మొత్తం 8 కేసులలో సొత్తును తమ సిబ్బంది స్వాధీనం చేసుకున్నార ని, వాటిలో జిల్లాలోని ఒంగోలు టూటౌన్‌–1, కందుకూరు–2, టంగుటూరు–1, కనిగిరి–1 వెరసి అయిదు కేసులు, కడప జిల్లా బద్వేలులో ఒకటి, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మరొకటి వెరసి ఏడు కేసులు ఉన్నాయన్నారు. అయితే 8వ కేసులో సొత్తును స్వా«ధీనం చేసుకోగలిగినా ఆ చైన్‌ ఎక్కడ చోరీ చేశాడనే విషయం బహిర్గతం కాలేదని ఎస్పీ పేర్కొన్నారు. దొంగిలించిన సొమ్మును అదే రోజు పాన్‌ బ్రోకర్ల వద్ద కుదువపెట్టి వాడుకోవడం పరిపాటిగా మారిందన్నారు.

వీటితోపాటు కడప జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందూపూర్, కదిరి, తాడిపత్రి, నెల్లూరు జిల్లాలో సంగం, కావలి, నెల్లూరు, వింజమూరు, బుచ్చిరెడ్డిపాలెంలలో కూడా నేరాలు చేసినట్లు అంగీకరించాడని, అయితే వీటికి సంబంధించిన సొత్తు రికవరీ కాలేదన్నారు. సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారులకు నిందితుడి సమాచారం పంపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొత్తు 204 గ్రాములని, విలువ రూ.6లక్షలుగా ఉంటుందన్నారు. అయితే 8వ చైన్‌ ఎవరిదనేది తెలి య రావడం లేదన్నారు. ఎవరైనా ఇప్పటివరకు ఇటువంటి తరహా ఘటనల్లో బంగారం పోగొట్టుకొ ని ఇంతవరకు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయని వా రు ఎవరైనా ఉంటే తక్షణమే సమీపంలోని పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా కేసును చేధించడంలో సత్తాచాటిన కందుకూరు సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సైలు యు.వేమన, ప్రభాకర్, ఎ ఎస్సైలు లక్ష్మణస్వామి, ఐటీ కోర్‌ కానిస్టేబుల్‌ సురేష్, హోంగార్డు విష్ణు, రవిలకు జిల్లా ఎస్పీ నగదు రి వార్డులు అందించి అభినందించారు. అదనపు ఎస్పీ కె.లావణ్యలక్ష్మి, కందుకూరు డీఎస్పీ కె.ప్రకాశరావు , స్పెషల్‌ బ్రాంచి సీఐ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement