సాక్షి, సూర్యపేట : ‘ఒక్కడు’ సినిమా చూసిన వారికి.. కుక్క నాటుబాంబు నోట్లో పెట్టుకుని పరిగెత్తే సీను గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో తెలంగాణ శకుంతల పెంపుడు కుక్క బాంబును నోట్లో పెట్టుకుని, ఆమె వైపు పరిగెత్తుతుంది. ఆమె భయంతో దాని నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తూతూ ఓ ఇంట్లోకి వెళుతుంది. ఆ కుక్క కూడా ఆ ఇంట్లోకి దూరిన వెంటనే ఆమె తలుపులు మూయటం, బాంబు పేలటం. ఇది ఆ సీను. కొద్దిగా ఇలాంటి సంఘటనే సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వీధి కుక్క బాంబును నోట్లో పెట్టుకుని పరిగెత్తుకు వెళుతూ ప్రమాదానికి గురై మృత్యువాత పడింది.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఓ వీధి కుక్కకు ఓ నాటు బాంబు దొరికింది. ఏదో తినే వస్తువు అనుకున్న ఆ కుక్క దాని నోట కరుచుకుని పరిగెత్తింది. ఉత్సాహంతో దాన్ని గట్టిగా కొరికింది. అంతే బాంబు కాస్తా పేలి మరణించింది. ఊర్లో నాటు బాంబు కలకలం రేపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment