ఢిల్లీలో ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్‌’ వికృత చర్చలు | Delhi Police Investigates School Boys Of Bois Locker Room Members | Sakshi
Sakshi News home page

‘బాయ్స్‌ లాకర్‌ రూమ్‌’: అందరూ 18 ఏళ్లలోపు వాళ్లే

May 6 2020 4:21 PM | Updated on May 6 2020 6:18 PM

Delhi Police Investigates School Boys Of  Bois Locker Room Members - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’‌ పేరుతో ఇన్‌స్టాగ్రాం గ్రూప్‌ క్రియేట్‌ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గ్యాంగ్‌ రేప్‌ ఎలా చేయాలన్న దానిపై విద్యార్థులు చర్చించుకోవడమే కాకుండా, విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలను షేర్‌ చేశారు. ఈ గ్రూప్‌లో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. అయితే విషయం బయటకు పొక‍్కడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.  ఇందుకు సంబంధించి ఇద్దరు గ్రూప్‌ అడ్మిన్‌లను అరెస్ట్‌ చేశారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

‘బాయ్స్‌ లాకర్‌ రూం’ గ్రూప్‌కు సంబంధించిన కొంతమంది యువకులను విచారిస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. కాగా అమ్మాయిలపై ఆకృత్యాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొట్టేలా సంభాషించిన ఈ గ్రూప్ నిర్వాహకుడిని మంగళవారం పోలీసు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.‌ నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగతావారిని పోలీసుల విచారిస్తున్నారు. అయితే వీరంతా దక్షిణ ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులని పోలీసులు తెలిపారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ... ఈ గ్రూపుకు సంబంధించిన 20మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకుని, వారి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక ఇవాళ (బుధవారం) కూడా విచారణ కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు.(పోలీసుల అదుపులో ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ సభ్యుడు)

బాయ్స్‌ లాకర్‌ రూం గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా 18 ఏళ్ల వయసులోపు వారేనని తమ ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. వారంత తమకు ఈ గ్రూపుతో ఎలాంటి సంబంధం లేదని, ఎవరో తమని గ్రూప్‌లో చేర్చారని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం ఇన్‌స్టా‌గ్రామ్‌ గ్రూప్‌ వివరాలను వెల్లడించాల్సిందిగా ఫేస్‌బుక్‌ యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. అయితే ఆ సంస్థ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు.  దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌‌ అధికారి స్పందిస్తూ.. వినియోగదారులు తమ ఖాతాలు సురక్షితంగా ఉంచుకునేందుకు ఖాతాను ప్రైవసీలో పెట్టుకునేలా తమ సంస్థ కొన్ని వెసులుబాటు కల్పించిందన్నారు. అయితే తమ సంస్థ లైగింక హింస, ముఖ్యంగా మహిళలపై యువకుల దోపిడీని ప్రోత్సహించే విధంగా ఉండే చర్యలకు తాము అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తమ సంస్థ నైతిక ప్రమాణాలను పాటిస్తుందని ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాణాలను ఉల్లఘించిన ఈ గ్రూప్‌ చాట్‌ను వెంటనే తమ ఖాతా నుంచి తొలగించినట్లు అధికారి తెలిపారు. (అశ్లీల ఫొటోలు షేర్‌ చేసి.. విపరీత వ్యాఖ్యలు)

కాగా కొంతమంది విద్యార్థులు బాయ్స్‌ లాకర్‌ రూం పేరిట గ్రూప్‌ క్రియేట్‌ చేసి అమ్మాయిలపై లైంగిక దాడి పాల్పడాలంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం కాకుండా బాలికల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీల ఫొటోలను షేర్‌ చేశారు. ఇందుకు సంబంధించిన విషయం ఆదివారం వెలుగు చూడంతో నెటిజన్లంతా సదరుయువకులపై కఠిన చర్యలు తీసుకోవాలిన పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేస్తున్నారు. (‘బాయ్స్‌ లాక్‌ రూం’పై పోలీసుల ట్వీట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement