
హైదరాబాద్ , అడ్డగుట్ట: పక్క తడుపుతుందని ఓ చిన్నారికి కన్నతండ్రే విచక్షణారహితంగా అట్లకాడతో వాతలు పెట్టిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గణేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి....అడ్డగుట ఏ సెక్షన్ ప్రాంతానికి చెందిన రాజు కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె వైష్ణవి(8) స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు నిద్రకు ఉపక్రమించగా కూతురు వైష్ణవి పక్కలో మూత్రం చేసిందని కొట్టాడు.
అక్కడితో ఆగకుండా సరాతం(అట్లకర్ర)తో ఒంటిపై వాతలు పెట్టాడు. దీంతో ఆమె కాళ్లు, వీపుపై తీవ్రగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రతినిధులు నార్త్‌జోన్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లగా, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డీసీపీ తుకారాంగేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైష్ణవి, వాతలు తేలిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment