సాక్షి, తూర్పుగోదావరి : చలి కాచుకోవడం కోసం వేసుకున్న మంటే ఆ వృద్ధుడి పాలిట చితి మంటలయ్యాయి. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన పిల్లి. వాడపల్లి(74) అనే వృద్ధుడు చలికి తట్టుకోలేక మంచం కింద నిప్పుల కుంపటి పెట్టుకుని నిద్రపోయాడు. గాలికి కుంపటిలోని నిప్పు రవ్వలు చెలరేగి పూరిళ్లు దగ్ధమయ్యింది. నిద్రలో ఉన్న వాడపల్లి కూడా మంటల్లో చిక్కుకున్నాడు.
మంటల్ని గమనించిన స్థానికులు వృద్ధున్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ లోపే పూర్తిగా కాలిపోయిన వాడపల్లి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment