కడప రూరల్: నాకు భర్త కావాలి. నాకు న్యాయం చేయాలని కడప నగరం మారుతినగర్‌కు చెందిన ఎద్దుల విజయశాంతి కోరారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బద్వేలు, తొట్టిగారిపల్లె ప్రభుత్వ వైద్యుడు ఎద్దుల చంద్రహాసరెడ్డికి ముందుగానే వివాహమైందన్నారు. మొదటి భార్యకు పిల్లలు కలగనందున తనను హిందు సాంప్రదాయం ప్రకారం జనవరి 4వ తేదీన తిరుమలలో వివాహం చేసుకున్నారన్నారు.
అంతకుముందు మొదటి భార్య ఉన్నందున ఈ వివాహనికి తాను అంగీకరించలేదన్నారు. ఆమెకు చట్టప్రకారం విడాకులు ఇవ్వమని తాను చెప్పానని పేర్కొన్నారు. అందుకు చంద్రహాసరెడ్డి ఆమెకు ‘భరణం’ చెల్లించినందున అది కుదరదని తెలిపారన్నారు. తరువాత ఏమీ కాదని అందరూ వత్తిడి చేయడంతో వివాహనికి అంగీకరించినట్లు తెలిపారు. వివాహం అయిన తరువాత భర్త వైపు నుంచి వేధింపులు ఎదురైనట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన పుట్టింటి నుంచి తనకు వచ్చే వాటాను తేవాలని తన భర్త ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఇప్పుడు తాను తన తల్లి వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment