
పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 35లోని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట గురువారం ఉదయం ఓ మహిళ హల్‌చల్ చేసింది. తాను పవన్ కల్యాణ్‌ను కలవాలంటూ అక్కడున్న సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగింది. రాళ్లతో చుట్టుపక్కల వారిని కొడుతూ దుస్తులు తీసేసి అటూ ఇటూ తిరుగుతూ న్యూసెన్స్‌కు పాల్పడింది. మహ్మద్ హసన్ అలీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు సదరు మహిళ గురించి ఆరా తీయగా ఆమె తమిళనాడు రాష్ట్రంలోని మధురై వైఓత్తకాడై ప్రాంతానికి చెందిన జాయిస్ కమల(36)గా తేలింది. గతంలో కూడా ఆమె హీరో సాయిధరమ్ తేజ్ ఇంటి ముందు ఇలాగే న్యూసెన్స్‌కు పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తరలించారు. మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలా ఈమె గతంలో కూడా సినీ హీరోల ఇంటి వద్ద తిరుగుతూ న్యూసెన్స్ చేసిందని పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment