మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్) సూర్య (ఫైల్)
అన్నానగర్: చెంగల్పట్టులో స్నేహితుడి ప్రేమ వివాహానికి సహకరించిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు.. కాంచీపురం జిల్లా చెంగల్పట్టు సమీపం మేలేరిబాక్కం బజనై ఆలయ వీధికి చెందిన శేఖర్ కుమారుడు సూర్య (23). ఇతను ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని భార్య గాయత్రి ఐదు నెలల గర్భిణి. ఈ స్థితిలో సోమవారం మేలేరి బాక్కం కాలువ పక్కన సూర్య గొంతు కోసిన స్థితిలో శవంగా పడిఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో.. కొన్ని రోజుల కిందట మేలేరిబాక్కం ప్రాంతానికి చెందిన కార్తిక్, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో సూర్య స్నేహితులతో కలిసి ఆలయంలో ప్రేమ జంటకు రహస్యంగా వివాహం జరిపించాడు. ఈ విషయం యువతి తరఫు వారికి తెలిసింది. దీంతో సూర్యను హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఈ స్థితిలో ఆదివారం రాత్రి సూర్యకు మద్యం విందు ఇస్తామని చెప్పి తీసుకెళ్లి గొంతు, పురుషాంగం కోసి దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ముగ్గురు హంతకుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment