సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో దారుణమైన సంఘటన జరిగింది. బ్రతికున్న వ్యక్తిని వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం భాను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆక్టీవా బైక్‌పై వెళ్తున్న భాను, రాజాలను వెనకనుంచి కారు ఢీ కొట్టగా ఇరువురిని పఠాన్ చెరువులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భాను కండిషన్ సీరియస్‌గా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా గాంధీ ఆసుపత్రి వైద్యులు బ్రతికున్న భానును చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో బంధువులంతా అతడు చనిపోయాడని ఆసుపత్రికి చేరుకున్నారు. ఫిర్యాదు రాసుకోవడానికి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్.. భాను బ్రతికే ఉన్నాడని గుర్తించాడు. దీంతో అతిడి బంధువులంతా వైద్యుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment