Gandhi hospital doctors
-
వైద్య లోకం కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: వైద్య లోకం కన్నెర్రజేసింది.. కోల్‌కతాలో జరిగిన అమానవీయ ఘటనను ఖండించింది. పీజీ విద్యారి్థపై అమానుషంగా దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో నినదించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా.. వైద్యుల నిరసనల కారణంగా పలు ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.నిరసనల హోరు.. నగరంలో శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిమ్స్, సనత్‌నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, గాంధీ ఆస్పత్రి వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఓపీ సేవలు నిలిపేసి ఆస్పత్రుల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కోల్‌కతా వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నేషనల్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్‌కు పలువురు వైద్యులు లేఖలు రాశారు. నో సేఫ్టీ.. నో డ్యూటీ నిమ్స్ వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కోల్‌కతా ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిమ్స్ రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరింది. శుక్రవారం విధులను బహిష్కరించారు. నిమ్స్ వైద్య బోధనా సిబ్బంది, నర్సులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నిమ్స్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని నిమ్స్ నర్సెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ కుమారి డిమాండ్ చేశారు.‘ఉస్మానియా’లో భారీ ర్యాలీ.. ఉస్మానియా జూనియర్ వైద్యుల సంఘం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉస్మానియా దంత కళాశాల నుంచి కోఠి ఉస్మానియా మెడికల్ కాలే జీ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయాలన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని కులీకుతుబ్‌షా భవనం మీదుగా ఓపీ బ్లాక్ వరకు 2 వేల మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. గాంధీ, ఈఎస్ఐసీలోనూ.. గాం«దీలో ఆస్పత్రిలో కూడా నిరసనలు కొనసాగాయి. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించిన జూడాలు నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణలు స్పష్టం చేశారు. జూడాలు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, లెప్రసీ విభాగాలు సంఘీభావం ప్రకటించాయి. నేడు నిమ్స్ ఓపీ సేవలు బంద్.. నిమ్స్ ఆస్పత్రిలో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిమ్స్‌లో ఓపీ సేవలు ఉండవన్నారు. శస్త్ర చికిత్సలను కూడా వాయిదా వేశామని చెప్పారు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.మహిళా వైద్యులకు రక్షణ లేదు.. ఉస్మానియా ఆస్పత్రిలో మహిళా వైద్యులకు భద్రతా సదుపాయాలు లేవు. విధులు నిర్వర్తించిన తర్వాత సరైన విశ్రాంతి గదులు లేవు. బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవు. ఆస్పత్రి ప్రాంగణాల్లో సరిపడా సీసీ కెమెరాలు లేవు. రాత్రి వేళల్లో ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లాలంటే భయం వేస్తోంది. – డాక్టర్ చంద్రికారెడ్డి జూనియర్ వైద్యురాలు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి దాడులు సరికాదు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు ఎలా చేయాలి? చిన్న చిన్న విషయాలకే డాక్టర్లపై దాడులు చేయడం సరికాదు. కోల్‌కతా లాంటి సంఘటనలు జరగడం శోచనీయం. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించాలి. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు చేయడం ప్రజలకే నష్టం. – శ్రీదేవి, వైద్యురాలు, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రి -
ఈ వ్యాధి పిల్లలో అరుదుగా వస్తోంది జాగ్రత్తగా ఉండండి
-
తెలంగాణ ఆస్పత్రుల్లోనూ కరోనా విజృంభణ..
-
గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలింది. గాంధీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్ సర్జన్స్ కోవిడ్ బారిన పడ్డారు. అదే విధంగా ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా తెలంగాణలో సోమవారం 1,825 కోవిడ్ కేసులు నమోదయయాయి. ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855, మరణాల సంఖ్య 4,043కి చేరింది. ప్రస్తుతం 14, 995 యాక్టివ్ కేసులున్నాయి. చదవండి: కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్ చదవండి: సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ -
ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ప్రపంచ దేశాలను వణికిసున్న ఒమిక్రాన్ వైరస్‌పై గాంధీ వైద్య నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. వైద్య పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (ద్రావకాలు) అందిన వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించి ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి మైక్రోబయోలజీ విభాగంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాధితుని నుంచి సేకరించిన నమూనాలను రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ (ఆర్టీ పీసీఆర్) టెస్ట్ చేసిన తర్వాత వైరస్ కణ నిర్మాణానికి సంబం ధించి ఆర్ఎన్ఏ, డీఎన్ఏలతో పాటు యమినో యాసిడ్స్ సీక్వెన్స్‌ను పరిశీలిస్తారు. కణ నిర్మాణంలో హెచ్చుతగ్గులు, అదనపు కణాల నిర్మాణం, వాటి సంఖ్య ఆధారంగా రూపాంతరం (మ్యుటేషన్ ) జరిగిన తీరుతెన్నులతో పాటు రూపాంతరం చెందిన వైరస్ మరింత బలపడి విజృంభిస్తుందా లేక బలహీనంగా మారిందా అనేది నిర్ధారిస్తారు. ప్రారంభదినాల్లో పుణేకి పంపి... గాంధీ మైక్రోబయోలజీ విభాగం ఆధ్వర్యంలో జీనో మ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. రీ ఏజెంట్స్ టెండరు ప్రక్రియ ముగిసిందని, సంబంధిత ద్రావకాలు అందిన వెంటనే మైక్రోబయోలజీ ల్యాబ్ ఇన్చార్జి ప్రొఫెసర్ నాగమణి నేతృత్వంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు ప్రారంభి స్తామని తెలిపారు. ప్రారంభదినాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలను తుది పరిశీలన కోసం పుణెలోని సెంట్రల్ ల్యాబ్ కు పంపించి నిర్ధారించుకుంటామని, పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తర్వాత నివేదికలను నేరుగా వెల్లడిస్తామని వివరించారు. ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్తలు పాటించండి కరోనా వైరస్ ముప్పు తొలగిపోలేదని, ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు సూచించారు. రూపాంతరం చెందిన ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదైన నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, అర్హులంతా రెండు డోసుల టీకా వేయించుకోవాలని కోరారు. ప్రస్థుతం గాంధీలో 9 బ్లాక్ ఫంగస్, 18 కేసులకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. -
Black Fungus: 6 తప్పుడు కేసులను గుర్తించిన వైద్యులు
గాంధీ ఆస్పత్రి: ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడు నెల క్రితం కరోనా బారిన పడ్డాడు. కొద్దిరోజుల క్రితం పైదవడ దంతాల నొప్పితో పాటు కదులుతున్నట్లు అనిపించడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్‌లు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి బ్లాక్‌ఫంగస్ అని చెప్పడంతో సదరు యువకుడు తీవ్రభయాందోళనకు గురై వెంటనే అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రోజలు వైద్యం అందించి బ్లాక్‌ఫంగస్ మందులు తెచ్చుకోవాలని సూచించారు. సదరు మందులు ప్రైవేటులో అందుబాటులో లేక యువకుడు రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల స్కానింగ్‌లు, వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు బ్లాక్ ఫంగస్ కాదని, సాధారణ పిప్పిపన్ను అని నిర్ధారించి, డెంటల్ వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి డిశ్చార్జి చేశారు. ► పాతబస్తీకి చెందిన మహిళకు కరోరా పాజిటివ్, మూడు రోజుల క్రితం పక్షవాతం రావడంతో స్థాని క ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బ్లాక్‌ఫంగస్ లక్షణా లు ఉన్నాయని చెప్పడంతో భయాందోళనకు గురైంది. తెలిసిన వారి సలహా మేరకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌తోపాటు పెరాలసిస్ వచ్చిందని, బ్లాక్‌ఫంగస్ ఆనవాళ్లు లేవని చెప్పి, కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్జి చేశారు. ► బ్లాక్‌ఫంగస్‌ను బూచిగా చూపిస్తూ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను అడ్డంగా దోచు కుంటున్నాయి. పిప్పిపన్ను, పక్షవాతం వంటి రుగ్మతలను బ్లాక్‌ఫంగస్ ఖాతాలో వేయడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ► ఓల్డ్‌సిటీకి చెందిన మరోవ్యక్తికి కరోనా, బ్లాక్‌ఫంగస్ లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, బ్లాక్‌ఫంగస్ సోకిందని చెప్పారు. సదరు వ్యక్తి గాంధీఆస్పత్రిలో చేరగా, నిర్ధారణ పరీక్షల్లో కరోనా, బ్లాక్‌ఫంగస్ లేవని తేలింది. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో రిఫరల్‌పై చేరిన ఆరుగురు బాధితులకు ఫంగల్ లక్షణాలు మచ్చుకైనా లేవని గుర్తించారు. ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి బాధితులను డిశ్చార్జి చేశారు. ఆరుగురు బాధితులను గుర్తించి డిశ్చార్జి చేశాం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై గాంధీఆస్పత్రి బ్లాక్‌ఫంగస్ వార్డులో చేరిన ఆరుగురికి ఫంగల్ లక్షణాలు లేవు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డిశ్చార్జీ చేశాము. వీరిలో ముగ్గురు దంత సంబంధ సమస్యలతో... మరో ముగ్గురు పెరాలసిస్ (ఫిట్స్)తో బాధపడుతున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత బ్లాక్‌ఫంగస్ సోకినట్లు భావించిన అవయవ భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ఫంగల్ కల్చర్ టెస్ట్‌కు మైక్రోబయోలజీ ల్యాబ్‌కు పంపిస్తాము. బయాప్సీ నివేదిక ఆధారంగా బ్లాక్‌ఫంగస్‌గా నిర్ధారిస్తాము. ప్రజలు భయాందోళనకు గురికావద్దు. గాంధీ, ఈఎన్టీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ నివారణకు వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..! -
4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి..
గాంధీ ఆస్పత్రి: బ్లాక్ ఫంగస్ సోకి మృత్యువుతో పోరాడుతున్న బాధితుడి ప్రాణాలు నిలి పారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. అందరూ అతడిపై ఆశలు వదిలేసుకున్నా.. డాక్టర్లు మాత్రం ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఐదు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిపి విజయం సాధించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, బ్లాక్ ఫంగస్ సర్జరీ కమిటీ చైర్మన్ శోభన్‌బాబు ఆదేశాల మేరకు ఆర్ఎంవో–1 నరేందర్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (45) కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతూ ఈనెల 19న ‘గాంధీ’లో చేరాడు. ఎడమ దవడ వాయ డంతో పాటు ఎడమ కన్ను పూర్తిగా కనిపించట్లేదు. కుడికన్ను కొంచెం కనిపిస్తోంది. ముఖం లోని పలు భాగాలకు ఫంగస్ వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, పాస్లిక్ సర్జరీ, అనస్థీషియా, న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 25న సుమారు 4 గంటల పాటు శ్రమించి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్నుతో పాటు, ముఖ భాగంలోని మాగ్జి లా ఎముకను తెరిచి ఫంగస్‌ను తొలగించారు. ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను కొంతమేర తొలగించి, శుభ్రపరిచారు. ప్రస్తు్తతం రోగి కోలుకుంటున్నాడు. బ్లాక్‌ఫంగస్ నియంత్రణకు పొసకొనజోల్ మందు ఇచ్చామని, ఇది అద్భుతంగా పనిచేసిందని వైద్యులు చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వా రా ఆయా భాగాలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ, ఆప్తా ల్మాలజీ హెచ్ఓడీలు సుబోధ్‌కుమార్, రవిశేఖర్, పలు విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. చదవండి: ఈ–పాస్ ఇలా తీసుకోండి -
కేటీఆర్ బొమ్మ.. యాజ్‌టీజ్ దించేశాడు!
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాక్టివిస్ట్ తక్కళ్లపల్లి వరుణ్ తాను వేసిన చిత్రపటాన్ని సోమవారం ప్రగతి భవన్ లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశాడు. తన కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యతో చిన్నవయసులో ఉన్నప్పుడు వారితో కలిసి ఉన్న చిత్ర పటాన్ని అత్యంత సహజంగా వేసిన వరుణ్ ను కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం కేటీఆర్ తన పిల్లలు ఇద్దరితో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఫొటోను చూసి వరుణ్ ఈ చిత్రాన్ని గీశారు. అచ్చం ఫొటోలో ఉన్నట్టుగానే ఈ పెయింటింగ్ వేశారు. ఈ చిత్రాన్ని చూసి మురిసిపోయిన కేటీఆర్ అప్యాయంగా వరుణ్‌ను హత్తుకుని అభినందనలు తెలిపారు. తనకు ఇంత మంచి కానుక ఇచ్చినందుకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. అయితే గత సెప్టెంబర్‌లో కూడా తన తండ్రి కేసీఆర్‌తో కేటీఆర్ కలిసివున్న చిత్రపటాన్ని వరుణ్ అందజేశారు. ‘గాంధీ’ వైద్యునికి అభినందనలు గాంధీ ఆస్పత్రి వైద్యుడు అర్జున్‌రావును మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందించారు. మేడ్చల్ జిల్లా కీసరలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్బిణీకి రోడ్డుపైనే పురుడు పోసి రెండు ప్రాణాలను అర్జున్‌రావు కాపాడారు. 108 అంబులెన్స్ వచ్చేలోపు తల్లీబిడ్డలను కాపాడిన డాక్టర్ అర్జున్‌రావుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కేటీఆర్.. మంచి పనిచేశారంటూ వైద్యుడిని అభినందించారు. చదవండి: హైదరాబాద్ వాసులకు సంక్రాంతి కానుక పై తరగతులకే : ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు -
గాంధీ ఆస్పత్రి ముందు వైద్యుల నిరసనలు
-
గాంధీ ఆస్పత్రికి అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆస్పత్రిలో ఆదివారం (మే 3) రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న ‘గాంధీ’ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. సెలవులను సైతం రద్దు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి కృషి వల్ల ఎందరో బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చింది. కరోనాని జయిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించబోతున్నారు. (చదవండి : వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) గాంధీ ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు. నర్సులు. తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరు కావాలని హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు కోరారు. వీరందరిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించి అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు సిబ్బంది అంతా తమ యూనిఫాంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హాజరు కావాలని.. ఎయిర్ ఫోర్స్ అందించే ప్రశంశలను అందుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరారు. కాగా, వైద్యులు చేస్తున్న కృషికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిపై ఆదివారం హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించనున్నారు. -
గాంధీ వైద్యులు గ్రేట్..
సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా మహమ్మారే కావచ్చు.. కానీ, సూది మందులు, ఇతర మెడిసిన్స్‌తో కంటే వైద్యులిచ్చిన మనో ధైర్యంతోనే దానిని జయిం చాం’ అని చెబుతున్నారు ఆ వైరస్ బారి నుంచి విజయ వంతంగా బయటపడిన వారు. 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న వీరు.. ఒంటరిగా గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. వైద్యులు, కుటుంబసభ్యులు వెన్నుదన్నుగా నిలవడంతోనే కరోనాను జయించామని చెప్పారు. మొండి వైరస్‌ను గుండెధైర్యంతో ఎదుర్కొన్న వీరంతా.. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రిలో నర్సుల నుంచి వైద్యుల వరకు అందించిన సేవలను, తమలో మానసిక స్థైర్యాన్ని కలిగించిన తీరును గుర్తుచేసుకున్నారు. తమకు పాజిటివ్ వచ్చిన దగ్గరి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు కలిగిన అనుభవాలను వారంతా పంచుకున్నారు. గాంధీ వైద్యులు గ్రేట్.. నేను లండన్‌లో ఓ యూనివర్సిటీలో ‘ఎమర్జెన్సీ పారామెడికల్’ కోర్సు చదువుతున్నా. మార్చి 19న హైదరాబాద్ వచ్చాను. అప్పటికే ఇక్కడ వైరస్ విస్తరించడంతో ఆందోళన చెందాను. విమానంలో థర్మోస్కానింగ్ కూడా చేశారు. క్వారంటైన్‌కు తరలించారు. ఆ తర్వాత బాధ్యతగా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంతో ఆశ్చర్యపోయా. నేను కరోనా బారినపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వైద్యం చేయించుకున్న తర్వాతే ఇంటికి వస్తానని చెప్పాను. 15 రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాను. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నా. గాంధీ ఆస్పత్రి వైద్యుల సేవలు మరిచిపోలేను. – గచ్చిబౌలి యువకుడు (25) కరోనా వైరస్‌ను మనోధైర్యంతోనే ఎదుర్కోవాలి. మందులు, సూదుల కంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రోత్సాహమే బలాన్నిస్తుంది. దీంతోనే నేను కరోనాను జయించాను. కంపెనీ పనిపై లండన్ వెళ్లి మార్చి మొదటి వారంలో ఇండియా వచ్చా. అప్పుడప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి గురించి విన్నా.. కానీ ఆ వ్యాధిలో పేర్కొన్న లక్షణాలేవీ నాలో కనిపించలేదు. కానీ కాస్త జ్వరంగా అనిపించింది. మూడు రోజులైనా తగ్గకపోయేసరికి అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న మా సిస్టర్ను సంప్రదించా. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోమన్నారు. గాంధీలో చేయిస్తే పాజిటివ్ వచ్చింది. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. గాంధీ ఆస్పత్రిలో పద్నాలుగు రోజులు స్నానం లేకుండా ఒంటరి జీవితం గడిపా. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో ఆ వెలితి తెలియలేదు. ఇక వైద్యులు రోజుకు పలుమార్లు వచ్చి నా పరిస్థితిని సమీక్షించేవారు. పౌష్టికాహారం అందించారు. ముఖ్యంగా వారిచ్చిన మనోధైర్యం మరిచిపోలేనిది. నేను మళ్లీ ఈరోజు సాధారణస్థితికి రావడానికి నా సిస్టర్‌తో పాటు గాంధీ వైద్యులు పోషించిన పాత్ర జీవితాంతం మరిచిపోను. – సాఫ్ట్వేర్ ఇంజినీర్ (49), కోకాపేట ఒత్తిడి పడ్డా.. ధైర్యం చెప్పారు! ఎన్నో ఆశలతో లండన్ వెళ్లాను. అక్కడ ఎంబీఏ చదువుతున్నా. కరోనా వైరస్ లండన్‌లో వ్యాపిస్తోందన్న భయంతో మార్చి 16న స్నేహితురాళ్లతో కలిసి లండన్ నుంచి బయల్దేరి 19న హైదరాబాద్ వచ్చాం. నాతో పాటు వచ్చిన ఇద్దరు ఏపీకి వెళ్లారు. అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. నన్ను రాజేంద్రనగర్ క్వారంటైన్లో ఉంచారు. మార్చి 20న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనపడ్డా. ఈ సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది అండగా నిలిచారు. ఏమీ కాదని, త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారంటూ కౌన్సెలింగ్ చేసి ధైర్యాన్నిచ్చారు. దీనికి కుటుంబసభ్యుల ప్రోత్సాహమూ తోడైంది. ఆ బలంతోనే వైరస్‌ను జయించగలిగాను. – గుంటూరు జిల్లాకు చెందిన యువతి (25) మొండి ధైర్యంతో బయటపడ్డా.. ఉమ్రా యాత్రకు వెళ్లొచ్చాక దగ్గు, జ్వరం వస్తే సాధారణమే అనుకున్నా. స్థానిక డాక్టర్‌కు చూపించుకుంటే మందులిచ్చి పంపారు. కానీ ఎంతకూ తగ్గలేదు. మార్చి 23న గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది. అందులోనూ బీపీ, షుగర్ ఉన్న వారికి హైరిస్క్ ఉంటుందని చెప్పారు. కానీ మొండి ధైర్యంతో, వైద్యుల సపోర్ట్‌తో 14 రోజులు గాంధీలో గడిపేయడంతో కరోనా నన్నేమీ చేయలేకపోయింది. చివరకు నెగెటివ్‌గా రావటంతో శనివారం నన్ను డిశ్చార్జి చేశారు. గాంధీలో మధ్యాహ్న భోజనం ఆలస్యమ య్యేది. షుగర్ ఉండటంతో గాబరా అయ్యేది. అయితే వైద్యుల ప్రోత్సాహం నన్ను మళ్లీ సాధారణ మనిషిని చేసింది. – బేగంపేట పాటిగడ్డకు చెందిన మహిళ (61) -
వీరు కరోనాను జయించారు!
గాంధీ ఆస్పత్రి: వీరు కరోనాను కలిసి జయించారు.. కంటికి కనిపించని శత్రువుపై పోరాడి విజయం సాధించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి వైద్యో నారాయణో హరిః అన్న నానుడిని నిజం చేశారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. గత కొన్నిరోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా బాధితులను శనివారం ఉదయం సురక్షితంగా డిశ్చార్జి చేసి, వారి స్వస్ధలాలకు ప్రత్యేక అంబులెన్స్‌లలో పంపినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, కరోనా కోర్‌కమిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డిలు ప్రకటించారు. డిశ్చార్జి సమయంలో బాధిత రోగులతో కలిసి ఫొటోలు దిగారు. వైద్య సేవల అనంతరం సుమారు 15 మంది బాధితులు కోలుకున్నారు. రెండుసార్లు చేపట్టిన నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు రావడంతో శుక్రవారం రాత్రి వారిని డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత రోగులంతా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతోపాటు భద్రాచలం, నిజామాబాద్, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారిని శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులో ఉంచి, శనివారం ఉదయం ప్రత్యేక వాహనాలు, అంబులెన్స్‌లలో స్వస్ధలాలకు పంపారు. డిశ్చార్జి అయిన వారిలో ఇండోనేసియాకు చెందిన వారు కూడా ఉన్నారు. మరో 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని, ఈ మధ్యలో ఎటువంటి లక్షణాలు కనిపించినా సమాచారం అందించాలని కోరుతూ వారికి తగిన సలహాలు, సూచనలు అందించారు. డిశ్చార్జి చేసిన బాధిత రోగుల వివరాలను ప్రజారోగ్య విభాగానికి అందిస్తామని, ఆయా ప్రాంతాల్లో గల ప్రజారోగ్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్లో ఉన్నాడా లేదా అనేది పరిశీలించి నివేదిక అందిస్తారని గాంధీ వైద్యవర్గాలు వివరించాయి. -
గాంధీ వైద్యుల తీరు మారదా..
గాంధీ ఆస్పత్రి: ఒకరికి చేయాల్సిన డెలివరీ మరొకరికి చేయడమే కాకుండా శిశువులను సైతం తారుమారు చేసి, గాంధీ గైనకాలజీ వైద్యులు తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితులు ఆరోపించారు. శిశువు మృతి చెందడంతోపాటు బాలింత పరిస్థితి కూడా విషమంగా ఉందని, దీనికి కారణమైన వైద్యులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళ భర్త ఎనగందుల హరీశ్‌తోపాటు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన సమత, హరీశ్ భార్యాభర్తలు. ఏడునెలల గర్భవతి అయిన సమతను ఈనెల 11వ తేదీన వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి గైనకాలజీ విభాగం లేబర్ వార్డులో చేర్పించారు. 12వ తేదీ రాత్రి ఐసీయూకు రమ్మని పిలిచి, అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ చేశామని చెప్పి మగశిశువును చూపించారు. ట్యాగ్‌లో మాత్రం ఆడశిశువుగా నమోదు చేశారు. 15వ తేదీ ఉదయం శిశువు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చి, గంట తర్వాత శిశువు మృతి చెందిందని చెప్పి మగ శిశువు మృతదేహాన్ని ఇచ్చారని, మరణ ధ్రువీకరణ పత్రంలో మాత్రం ఆడశిశువుగా నమోదు చేశారని చెప్పారు. కేస్‌షీట్, ట్యాగులలో ఉన్న ఫిమేల్‌ను మేల్‌గా మార్చి, మరణ ధ్రువీకరణ పత్రంలో మేల్‌గా సరిదిద్దారని తెలిపారు. సదరు ట్యాగులను సిబ్బందే తీసుకున్నారని, ఆర్ఎంఓకు ఫిర్యాదు చేయగా ట్యాగ్ విషయంలో తప్ప అన్నీ సక్రమంగానే ఉన్నాయని నమ్మించారని తెలిపారు. కేస్‌షీట్‌లోనూ ఫిమేల్‌ను మేల్‌గా, శిశువు బరువు 1 కేజీకి బదులుగా 900 గ్రాములని, పుట్టిన సమయం కూడా మార్పు చేశారని ఆరోపించారు. అదే కేస్‌షీట్‌లో సమతకు బదులుగా మాధవి, లక్ష్మమ్మలకు చెందిన రిపోర్టులు ఉన్నాయన్నారు. మాధవి, లక్ష్మమ్మ రిపోర్టుల ఆధారంగా సమతకు వైద్యచికిత్సలు అందించారని, సమత చేతిపై భవానీ అనే పేరు రాసి ఉన్నట్లు తర్వాత గుర్తించామన్నారు. భవానీకి జరగాల్సిన డెలివరీ సమతకు చేశారని, ఏడునెలలకే డెలివరీ చేసి శిశువు మృతికి, బాలింత సమత ప్రాణాపాయస్థితికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. అయితే డెలివరీ కోసం వచ్చే గర్భిణీల చేతులకు ట్యాగులు మాత్రమే కట్టి వివరాలు అందులో పొందుపర్చుతామని, అరచేతిపై పేర్లు రాసే పద్ధతి లేదని గాంధీ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నలుగురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ బాధితుడు హరీశ్ ఫిర్యాదు మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. కమిటీలో కృష్ణమోహన్ (జనరల్ సర్జరీ హెచ్ఓడీ), డాక్టర్ జార్జ్ (పీడియాట్రిక్ ప్రొఫెసర్), రాజారావు (జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ), పద్మ (లేడీ ఆర్ఎంఓ)లు సభ్యులుగా ఉంటారని, బుధవారం సాయంత్రంలోగా నివేదిక అందిస్తారని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. -
మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్ వసంత్
-
మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్ వసంత్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. వైద్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాను మానసికంగా బాగానే ఉన్నానని సస్పెన్షన్‌కు గురైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత్ స్పష్టం చేశారు. తనకు మతి స్థిమితం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరి నుంచి డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. (పెట్రోల్ బాటిళ్లు నడుముకు కట్టుకుని... ) ‘ నా వ్యక్తిగత విషయాలు, బంధువులతో మాట్లాడిన సంభాషణలను బహిర్గతం చేశారు. శ్రవణ్ కుమార్ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో అబద్ధాలు చెప్పిస్తున్నారు. బయోమెట్రిక్ పద్ధతి లేకుండా చాలా అక్రమాలకు పాల్పడ్డారు. శానిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరూ డీఎంఈకి ఫిర్యాదు చేశారు. నేను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకుంటే నాపై కక్ష కట్టారు. డీఎంఈ రమేశ్ రెడ్డి ఇప్పటికైనా న్యాయం వైపు మాట్లాడాలి’ అని డాక్టర్ వసంత్ కోరారు. కాగా గాంధీ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా గురువారం సాయంత్రం ఆస్పత్రిని పరిశీలించారు. కాగా గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు కోవిడ్–19 (కరోనా వైరస్) బారినా పడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంతో సీఎంవో డాక్టర్ వసంత్ సస్పెండ్ అయ్యారు. అయితే తాను చేయని తప్పుకు బలయ్యానని.. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మంగళవారం నడుము చుట్టూ పెట్రోల్ బాటిళ్లను కట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
గాందీ ఆసుపత్రిలో అక్రమాలు జరగలేదు
-
డాక్టర్ వసంత్ ఆరోపణల్లో వాస్తవం లేదు
-
గాంధీ వైద్యుల మధ్య ‘కరోనా’ లొల్లి!
గాంధీఆస్పత్రి : కరోనా నోడల్ కేంద్రం ఏర్పాటు, వైద్య చికిత్సల విషయంలో వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పారిశుధ్య లోపానికి తోడు సరిపడు స్టాఫ్ నర్సులు కూడా లేని ఆస్పత్రిలో ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అని అంతర్గత సమావేశంలో ఉన్నతాధికారులను నిలదీసిన ఓ వైద్యుడిపై ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలనా వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు సున్నితమైన అంశాలపై బహిరంగ విమర్శలు చేస్తూ ఆస్పత్రి పరువు తీస్తున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి పాలనా యంత్రాంగం డీఎంఈ, డీహెచ్ సహా వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి పాలనా యంత్రాంగం పనితీరులోని లోపాలను ఎత్తి చూపినందుకే ఉన్నతాధికారులు కక్ష్యపూరితంగా తనపై ఏకపక్ష చర్యలకు పూనుకున్నారని గాంధీఆస్పత్రి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డాక్టర్ వసంత్ కుమార్ ఆరోపించారు. అధికారుల అక్రమాలపై ప్రశ్నించినందుకే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు ఫిర్యాదులు నమోదు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలేమైందంటే.. ? కరోనా అనుమానితులకు అందించాల్సిన వైద్యసేవలు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఇటీవల ఆస్పత్రిలోని ఆయా విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎంఓ–1 జయకృష్ణ, కరోనా నోడల్ అధికారి ప్రభాకరరెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ, మినిస్టీరియల్ ప్రతినిధి యాదిలాల్, అసిస్టెంట్ మేనేజర్ శివరామ్ తదితరులతో సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో సీఎంఓ వసంతకుమార్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చి ఆస్పత్రిలో పారిశుధ్య లోపం ఉంది. నర్సులు కూడా అందుబాటులో లేరు. మీరంతా ఏం చేస్తున్నారు.? అంటూ ఆర్ఎంఓ–1 జయకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమైన సమావేశంలో ఉన్నామని, మిగతా అంశాలపై ఆ తర్వాత చర్చించు కుందామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పాలనా యంత్రాంగం సూచించింది. అయితే ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.డాక్టర్ వసంతకుమార్ ప్రవర్తనా తీరును పాలనా యంత్రాంగం తప్పు పట్టింది. లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం ఆ యన్ను డీఎంహెచ్‌కు సరెండర్ చేశారు. సీసీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకున్నాం సీఎంఓగా విధులు నిర్వహించిన వసంత్‌కుమార్‌పై క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అపీల్( సీసీఏ) యాక్టు ప్రకారం చర్యలు తీసుకున్నాం. గాంధీలో కరోనా నోడల్ సెంటర్ ఏర్పాటుపై కేంద్ర నిఘా విభాగానికి డాక్టర్ వసంత్‌కుమార్ తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇకపై గాంధీ ఆస్పత్రితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. సీఎంఓ వసంత్‌కుమార్ డబ్బులు ఇవ్వాలని తమను డిమాండ్ చేశారని గాంధీ మెడికల్ షాపుల యాజమానులు, క్యాంటీన్ నిర్వాహకులు, కాంట్రాక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఆయనపై గతంలో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చిలకలగూడ పోలీసులు సమాచారం అందించారని సూపరింటెండెంట్ తెలిపారు.–డాక్టర్ శ్రవణ్‌కుమార్,సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రసవం చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న ఓ మహిళకు డెలివరీ చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న సదురు మహిళకు స్వైన్‌ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు. తర్వాత కొద్ది రోజులకు తల్లి, బిడ్డను ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న తన కూతురికి చికిత్స చేయడానికి కార్పొరేట్ వైద్యులు 25 లక్షల రూపాయలు అడిగారని.. అయినా గ్యారంటీ లేదన్నారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను బతికించిన గాంధీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
దారుణం: బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడని..
-
దారుణం: బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడని..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో దారుణమైన సంఘటన జరిగింది. బ్రతికున్న వ్యక్తిని వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం భాను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆక్టీవా బైక్‌పై వెళ్తున్న భాను, రాజాలను వెనకనుంచి కారు ఢీ కొట్టగా ఇరువురిని పఠాన్ చెరువులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భాను కండిషన్ సీరియస్‌గా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా గాంధీ ఆసుపత్రి వైద్యులు బ్రతికున్న భానును చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో బంధువులంతా అతడు చనిపోయాడని ఆసుపత్రికి చేరుకున్నారు. ఫిర్యాదు రాసుకోవడానికి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్.. భాను బ్రతికే ఉన్నాడని గుర్తించాడు. దీంతో అతిడి బంధువులంతా వైద్యుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. మహిళ చెవి పక్కన పెరుగుతున్న ఆరుకిలోల బరువుగల కణితిని విజయవంతంగా తొలగిం చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పేరినసింగారం గ్రామానికి చెందిన నాగమ్మ (56) ఎడమచెవికి ఆనుకుని పెరుగుతన్న కణితితో 20 ఏళ్లుగా బాధపడుతోంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. స్థానిక వైద్యుల సూచన మేరకు ఈనెల 12న గాంధీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యపరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని సర్జరీ వైద్యుడు ఆర్. రఘు ఆధ్వర్యంలో సోమవారం సుమారు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. దీనిని పేరోటిడ్ ట్యూమర్ అంటారని, 25 ఏళ్ల క్రితం శస్త్రచికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించినా మళ్లీ పెరిగిందని డాక్టర్ రఘు తెలిపారు. రెండోసారి ఆపరేషన్ ప్రమాదంతో కూడుకున్నదైనప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. నాగమ్మ కోలుకుంటుందన్నారు. లక్షలాది రూపాయల వ్యయం అయ్యే అరుదైన ఆపరేషన్‌ను గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామన్నారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యు లు ఆర్.రఘు, ఎల్.రమేష్, బాలాజీ, హరినాథ్, జ్యోతి, పీజీలు సురయ్య, రవీందర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.ఎస్.అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ శ్రీలత అభినందించారు.