గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ప్రపంచ దేశాలను వణికిసున్న ఒమిక్రాన్ వైరస్‌పై గాంధీ వైద్య నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. వైద్య పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (ద్రావకాలు) అందిన వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించి ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి మైక్రోబయోలజీ విభాగంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాధితుని నుంచి సేకరించిన నమూనాలను రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ పీసీఆర్) టెస్ట్ చేసిన తర్వాత వైరస్ కణ నిర్మాణానికి సంబం ధించి ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏలతో పాటు యమినో యాసిడ్స్ సీక్వెన్స్‌ను పరిశీలిస్తారు. కణ నిర్మాణంలో హెచ్చుతగ్గులు, అదనపు కణాల నిర్మాణం, వాటి సంఖ్య ఆధారంగా రూపాంతరం (మ్యుటేషన్ ) జరిగిన తీరుతెన్నులతో పాటు రూపాంతరం చెందిన వైరస్ మరింత బలపడి విజృంభిస్తుందా లేక బలహీనంగా మారిందా అనేది నిర్ధారిస్తారు.
ప్రారంభదినాల్లో పుణేకి పంపి...
గాంధీ మైక్రోబయోలజీ విభాగం ఆధ్వర్యంలో జీనో మ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. రీ ఏజెంట్స్ టెండరు ప్రక్రియ ముగిసిందని, సంబంధిత ద్రావకాలు అందిన వెంటనే మైక్రోబయోలజీ ల్యాబ్ ఇన్‌చార్జి ప్రొఫెసర్ నాగమణి నేతృత్వంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు ప్రారంభి స్తామని తెలిపారు. ప్రారంభదినాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలను తుది పరిశీలన కోసం పుణెలోని సెంట్రల్ ల్యాబ్ కు పంపించి నిర్ధారించుకుంటామని, పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తర్వాత నివేదికలను నేరుగా వెల్లడిస్తామని వివరించారు.
ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్తలు పాటించండి
కరోనా వైరస్ ముప్పు తొలగిపోలేదని, ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు సూచించారు. రూపాంతరం చెందిన ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదైన నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, అర్హులంతా రెండు డోసుల టీకా వేయించుకోవాలని కోరారు. ప్రస్థుతం గాంధీలో 9 బ్లాక్ ఫంగస్, 18 కేసులకు వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment