సాక్షి,న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ద్వారకా ప్రాంతంలో ఆదివారం మూడేళ్ల బాలికపై అదే భవనంలో గార్డుగా పనిచేసే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో చిన్నారి తల్లితండ్రులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గార్డు రంజీత్ (40)కు స్ధానికులు దేహశుద్ధి చేయడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరగడం హేయమని, నిర్భయ ఉదంతం చోటుచేసుకుని ఆరేళ్లయినా ఇంకా దేశ రాజధానిలో బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment