యువతితో నిశ్చితార్థం.. వరుడి పరారీ | groom escape after his engagement | Sakshi
Sakshi News home page

యువతితో నిశ్చితార్థం.. వరుడి పరారీ

Published Thu, Oct 19 2017 9:15 AM | Last Updated on Thu, Oct 19 2017 9:56 AM

groom escape after his engagement

సాక్షి, బెంగళూరు(హుబ్బళ్లి): ఓ యువతిని వివాహం చేసుకునేందుకు  బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఓ యువకుడు.. పెళ్లి కొద్ది రోజుల్లో ఉందనగా చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. దీంతో యువతి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేశ్వాపుర పోలీసుల కథనం మేరకు..హుబ్బళ్లి నగరం బెంగేరిలోని సాయి లేఔట్‌లో నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి కిషోర్‌ కటారేకు ఇదే నగరానికి చెందిన యువతితో  ఇటీవల నిశ్చితార్థం జరిగింది.

ఈనెల 28న నగరంలోనే వారిద్దరికీ వివాహం చేయాలని వధూవరుల తరఫు వారు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో తనకు ఈ వివాహం ఇష్టం లేదని చెబుతూ సదరు యువకుడు ఇంటి నుంచి ఉడాయించాడు. యువతి తల్లిదండ్రులు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకుడి కోసం గాలింపు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement