![Husband Killed Wife After Suicide in Kadapa - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/22/huband.jpg.webp?itok=OJicHxdN)
మృతి చెందిన కొండయ్య
వైఎస్‌ఆర్ జిల్లా, సింహాద్రిపురం : కూలీ డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితిలో కోపంతో భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ నాగబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింహాద్రిపురం మండల పరిధిలోని అంకాలమ్మ గూడూరులో నివాసముంటున్న కొండయ్య తన పొలంలో నాలుగు రోజుల క్రితం కలుపుతీత పనులు చేపట్టాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కొండయ్య మద్యం తాగి వచ్చి తన భార్య వెంకటసుబ్బమ్మ(45)తో కూలీ డబ్బు విషయమై గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి భార్యను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన కోడలు సింధుకు గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన భార్య మృతి చెంది ఉంటుందని భావించి ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని కొండయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటసుబ్బమ్మను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బుధవారం ఉదయం కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో అంకాలమ్మ గూడూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment