కిరాతకుడు.. | husband kills wife | Sakshi
Sakshi News home page

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టిన భర్త

Dec 10 2017 7:10 PM | Updated on Sep 5 2018 9:47 PM

husband kills wife - Sakshi

బనశంకరి : కట్టుకున్నవాడు కాలయముడయ్యాడు. అగ్నిదేవుడి సాక్షిగా ఏడడుగులు వేసిన వాడు, భార్యను ఆ అగ్నికే ఆహుతి చేశాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టి హత్య చేసిన సంఘటన రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. రంజనీపురం రోడ్డు మూడో క్రాస్‌లో చెన్నకేశవ, శోభ(26) దంపతులు నివాసముంటున్నారు. కూలి పనులు చేసే చెన్నకేశవకు పదేళ్ల క్రితం శోభతో వివాహం జరిగింది. ఇటీవల దంపతుల మధ్య కుటుంబ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా ఇదే విషయమే దంపతులు గొడపడ్డారు. ఇది కాస్తా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆవేశానికి లోనైన చెన్నకేశవ భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడు. మంటలను భరించలేక శోభ కేకలు వేయడంతో భర్త అక్కడి నుంచి పరారు అయ్యాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేసి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గం మధ్యలో మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement