
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగల వ్యాపారి అనిల్ అగర్వాల్ ఇంట్లో రూ. 3.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ద్వారా డబ్బులు పంచుతున్నట్టు పోలీసుల గుర్తించారు. పట్టుబడిన నగదును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ నగదు మొత్తం నగల వ్యాపారి అనిల్ అగర్వాల్‌కు సంబంధించినదిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ వ్యాపారీ హవాలా రూపంలో మనీ సర్క్యూటేట్ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ప్రకాశ్ అనే వ్యక్తికి అనిల్ అగర్వాల్ ఇదివరకే రూ.కోటి ఇచ్చినట్లుగా విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అయితే ఆ కోటి రూపాయలు ఎక్కడికి తరలించారో తెలియరాలేదు. ఎన్నికల్లో అభ్యర్థులకు ఇచ్చేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన సొమ్ము ఏపీ ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్నారా లేదా తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి సరఫరా చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment