తప్పతాగి బాలికను వేధించబోతే... | Jammu Kashmir Eve Teasing Back Fires | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 9:29 AM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

Jammu Kashmir Eve Teasing Back Fires - Sakshi

శ్రీనగర్‌ : తప్పతాగిన ముగ్గురు యువకులు రోడ్డు మీద వెళ్లే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బైక్‌పై దూసుకెళ్లారు. ఇంతలో ఓ స్కూల్‌ విద్యార్థిని స్కూటీపై వెళ్తుండగా.. ఆమెను వేధించాలని డిసైడ్‌ అయ్యారు. మార్గం మధ్యలో బైక్‌ దిగిన ఒకడు ఆమెను అడ్డగించేందుకు యత్నించాడు. అయితే ఆమె వేగంగా దూసుకెళ్లటంతో బైక్‌ తగిలి బొక్కా బొర్లాపడిపోయాడు. ఆ యత్నంలో బాలిక కూడా కింద పడిపోయింది.  ఆ వెంటనే ఆమె పైకి లేవగా.. ఆ పోకిరీ మాత్రం కదలకుండా అలాగే ఉండిపోయాడు. భయంతో మిగతా ఇద్దరు అతన్ని కదలించే యత్నం చేశారు. ఈ ఘటనంతా అక్కడే ఉన్న ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. జమ్ము కశ్మీర్‌ దొడా జిల్లా భాదర్వా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. మంచి పని అయ్యిందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement