రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం | Kannada Tv Actress Mebina Michael Deceased In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి

Published Wed, May 27 2020 4:16 PM | Last Updated on Thu, May 28 2020 8:37 AM

Kannada Tv Actress Mebina Michael Deceased In Road Accident - Sakshi

బెంగళూరు: కన్నడ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటి మెబీనా మైఖేల్‌(22) దుర్మరణం పాలయ్యారు. తన స్వస్థలం మెడికెరికి వెళ్తుండగా దేవీహళ్లి వద్ద ఓ ట్రాక్టర్‌ ఆమె కారుపైకి దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెబీనాను సమీప ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మరణించినట్లు స్థానికులు తెలిపారు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన మెబీనా... ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మెబీనా.. నిబంధనల సడలింపుల నేపథ్యంలో సొంతూరికి వెళ్లేందుకు పయనమై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. (టీవీ న‌టి ఆత్మ‌హ‌త్య)

కాగా మెబీనా మరణవార్తతో ఆమె స్నేహితులు, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో పీహెచ్‌హెచ్‌ఎల్‌ 4 హోస్ట్‌ అకుల్‌ బాలాజీ ట్విటర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘నా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. మెబీనా చిన్న పిల్ల. తను చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. కానీ ఇంతలోనే ఇలా. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’అంటూ మెబీనాకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.(మనుషుల్ని పీక్కుతినే జాంబీలు. ఓటీటీకి థ్యాంక్స్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement