
ప్రమాదంలో ధ్వంసమైన కారు(ఇన్‌సెట్‌లో ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు: మంత్రివర్గ విస్తరణ హడావిడిలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని విషాదం ఎదురైంది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ దుర్మరణం చెందారు. గోవా నుంచి బాగల్‌కోట్‌కు రోడ్డు మార్గం గుండా వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాయి.
మంత్రి రేసులో ముందంజ.. అంతలోనే విషాదం: జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త అభిమానులను, కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమ్మెల్యే మృతి పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రమే గౌడ అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment