లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య | Khammam Labour Officer Anand Reddy Assasinated At Bhupalpally Forest | Sakshi
Sakshi News home page

లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య

Published Tue, Mar 10 2020 6:47 PM | Last Updated on Tue, Mar 10 2020 7:53 PM

Khammam Labour Officer Anand Reddy Assasinated At Bhupalpally Forest - Sakshi

సాక్షి, వరంగల్‌ : ఖమ్మం లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు. ఆనంద్‌రెడ్డిని సీఐ ప్రశాంత్‌రెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి  హత్యచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌రెడ్డి మూడు రోజుల కిందట హన్మకొండలో కిడ్నాప్‌ అయ్యారు. నగరంలోని ఒక హోటల్‌ నుంచి బయటకు వెళ్లిన ఆనంద్‌రెడ్డి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆనంద్‌రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు భూపాలపల్లి అడవుల్లో ఆనందర్‌రెడ్డి ఫోన్‌ సిగ్నల్స్‌ నిలిచిపోయినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ దిశలో విచారణ చేపట్టారు. మరోవైపు ఆనంద్‌ను ప్రదీప్‌ తీసుకెళ్లిన కారును పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించారు. కారును వాష్‌ చేసి అల్వాల్‌లోని స్నేహితుడి ఇంటివద్ద వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement