Anand Reddy
-
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఏపీ విద్యార్థుల దుర్మరణం
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరు బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్–జమ్మూ నేషనల్ హైవేలో రామబన్ జిల్లా మగర్కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.కాగా, కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు. -
విశాఖలో అదృశ్యమైన ఆరుగురు విద్యార్థినిలు సురక్షితం
-
‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి, సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాతపడుతున్నారు. కొంతమందిని కరోనా బలితీసుకుంటే మరికొంత మంది అనారోగ్యంతో కన్నుమూస్తున్నారు. తాజాగా.. పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమాలో నటించిన నటి కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె బాబాయ్, టీఆర్ఎస్ నాయకుడు కేశ్‌పల్లి (గడ్డం) ఆనందరెడ్డి(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్లో అడ్మిట్ అయిన కొంత సమయానికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి తనయుడు. మొదట యూత్ లీడర్‌గా పని చేసిన ఆయన.. 2014లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. కాగా కీర్తిరెడ్డికి 2004లో హీరో సుమంత్‌తో వివాహం జరగ్గా 2006లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అనంతరం కీర్తి మరో పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడ్డారు. ఇక తన బాబాయ్ మరణవార్త విని ఆమె హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. చదవండి: బాలయ్యను చూసి ఆశ్చర్యపోయా : ప్రగ్యా జైస్వాల్ ఆ హీరోయిన్స్‌తో పోలుస్తూ నన్ను అవమానించేవారు: హీరోయిన్ -
ఆర్ధిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై బలవన్మరణం
-
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కిడ్నాప్, హత్య
కాజీపేట అర్బన్ /భూపాలపల్లి /జనగామ అర్బన్: రియల్ మాఫియా ఉచ్చులో పడిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్‌రెడ్డి (45) హత్యకు గురయ్యారు. వ్యాపార లావాదేవీల కారణంగా హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. హత్యా ప్రదేశాన్ని నిందితుల్లో ఒకరు చూపించగా.. మృతదేహాన్ని మంగళవారం రాత్రి పొద్దుపోయాక గుర్తించారు. జనగామ నుంచి ఖమ్మం జనగామ జిల్లా ఓబుల్‌కేశపూర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి, పద్మ దంపతుల పెద్ద కుమారుడు ఆనంద్‌రెడ్డి తొలుత జనగామ, వరంగల్‌లలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఇన్చార్జి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వచ్చే ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 7వ తేదీన హన్మకొండలోని ఓ హోటల్‌కు ప్రదీప్‌రెడ్డి వచ్చాడని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ హోటల్‌కు వెళ్లాక ఏం చర్చించుకున్నారో ఏమో కానీ.. బయటకు వెళ్లే సమయంలో ఆనంద్‌రెడ్డి తన సోదరుడు శివకుమార్‌రెడ్డికి ఫోన్ చేశారు. ‘ప్రదీప్‌రెడ్డి భూపాలపల్లి రామారంలో స్థలం చూపిస్తానని చెబుతున్నాడు.. నువ్వు కూడా రా’అంటూ శివకుమార్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. దీంతో ఆయన నేరుగా భూపాలపల్లికి వెళ్లి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో హన్మకొండలో తమ బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. 8న హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. తమకు ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని ఆనంద్ సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, హన్మకొండ హోటల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ప్రదీప్‌రెడ్డి కారులో ఆనందర్ రెడ్డి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇసుక వ్యాపారం కోసం రూ.80 లక్షల అప్పు ప్రదీప్‌రెడ్డి చేసే ఇసుక వ్యాపారం నిమిత్తం ఆనంద్‌రెడ్డి రూ.80 లక్షల వరకు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. కాగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా.. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, అందుకు తగ్గట్లు స్థలాన్ని ఇస్తానని బదులిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో భూపాలపల్లి రాంపూర్‌లో స్థలం చూపిస్తామని నమ్మించి తన స్నేహితుడు, డ్రైవర్‌తో కలసి వాహనంలో ఆనంద్‌ను తీసుకెళ్లి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, వేరే చోట హత్య చేసి రాంపూర్ వద్ద మృతదేహాన్ని వేశారా, లేక అక్కడే హత్య చేశారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మృతదేహాన్ని చూపించిన నిందితుల్లో ఒకరు? ఆనంద్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించినట్లు సమాచారం. అనుమానితులైన ప్రదీప్‌రెడ్డి, ఆయన సోదరుడు, డ్రైవర్ ఫోన్లు స్విచ్చాఫ్ వచ్చినట్లు సమాచారం. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురిలో ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్– రాంపూర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని గట్టమ్మ దేవాలయం సమీపంలో ఆనంద్‌రెడ్డి మృతదేహం ఉందని నిందితుడు చెప్పగా.. లైట్ల సాయంతో గంటపాటు వెతికారు. దుర్వాసన ఆధారంగా గట్టమ్మ గుడి నుంచి కిలోమీటరు దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. చేతులు కట్టేసి హత్య ఆనంద్‌రెడ్డిని ముగ్గురు వ్యక్తులు కలసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఒక టెంటు కింద కూర్చొని మద్యం సేవించాక.. అతడి చేతులు వెనుకకు కట్టేసి చంపినట్లు చెబుతున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఎక్కడెక్కడ కత్తిపోట్లు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. ప్రదీప్‌రెడ్డిని గత ఏడాదే బహిష్కరించాం: టీఆర్ఎస్ కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదని.. ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పలు పార్టీలు మారిన ప్రదీప్‌రెడ్డి.. టీఆర్ఎస్లో చేరినా కొద్దికాలమే కొనసాగారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు గతేడాది మే 6న పార్టీ నుంచి ప్రదీప్‌రెడ్డిని సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. -
లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య
-
లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య
సాక్షి, వరంగల్ : ఖమ్మం లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు. ఆనంద్‌రెడ్డిని సీఐ ప్రశాంత్‌రెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి హత్యచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌రెడ్డి మూడు రోజుల కిందట హన్మకొండలో కిడ్నాప్ అయ్యారు. నగరంలోని ఒక హోటల్ నుంచి బయటకు వెళ్లిన ఆనంద్‌రెడ్డి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆనంద్‌రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు భూపాలపల్లి అడవుల్లో ఆనందర్‌రెడ్డి ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోయినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ దిశలో విచారణ చేపట్టారు. మరోవైపు ఆనంద్‌ను ప్రదీప్ తీసుకెళ్లిన కారును పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించారు. కారును వాష్ చేసి అల్వాల్‌లోని స్నేహితుడి ఇంటివద్ద వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది. -
ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అదృశ్యం
-
రోడ్డు ప్రమాదం లో టీఆర్ఎస్ నేత మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఏఎస్‌రావునగర్: రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నేత మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఏఎస్‌రావునగర్ డివిజన్ బృందావన్ కాలనీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి(50). మద్యం మానేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి సోమవారం నల్లగొండ జిల్లాకు వెళ్లాడు. విరుగుడు మందు తీసుకుని తిరిగివస్తుండగా మాల్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీ కొనడంతో డ్రైవింగ్ చేస్తేన్న ఆనంద్ రెడ్డి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో కారులో ఉన్న చంద్రశేఖర్, రాజశేఖర్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లా చాడ గ్రామానికి చెందిన ఆనంద్ రెడ్డి చాలాకాలంగా నగరంలో స్థిర పడ్డాడు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డికి ఈయన సమీప బంధువు. పన్నాల దేవేందర్‌రెడ్డి, ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ పజ్జూరి పావనీరెడ్డిలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనంద్‌రెడ్డి నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. -
కొత్త రాజధానితో సిమెంటుకు డిమాండ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణ రంగం పుంజుకునేంతవరకు సిమెంట్ పరిశ్రమలో ఒడుదుడుకులు తప్పవని సాగర్ సిమెంట్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. ఆనంద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, రియల్ ఎస్టేట్ సంస్థలు దూకుడు తగ్గించటం వంటి అంశాలు సిమెంట్ విక్రయాలపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించే గృహ, రోడ్డు, ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కాకపోవడం, మందగించిన డిమాండ్, స్థిర వ్యయాల భారం, పెరుగుతున్న రవాణా ఛార్జీలు తయారీ సంస్థల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సాక్షి ప్రతినిధికి ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి మౌలిక వసతుల కల్పన సిమెంట్ పరిశ్రమకు ఎంతో కలిసివచ్చే అంశమని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పరిస్థితుల్లో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. బీఎంఎం విలీనం పూర్తికావచ్చింది...: తాడిపత్రిలో ఇటీవల తాము కొనుగోలు చేసిన బీఎంఎం విలీనం ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా బీఎంఎం పూర్తిగా సాగర్ గ్రూప్ కంపెనీ అవుతుందని ఆనంద రెడ్డి వివరించారు. విలీనం తర్వాత సాగర్ సిమెంట్స్ స్థాపక సామర్థ్యం 37.5 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. బీఎంఎం ప్లాంటువల్ల సాగర్ బ్రాండ్ సిమెంట్ కర్నాటక, కేరళ, సీమంధ్ర ప్రాంతాల మార్కెట్‌కు అందుబాటులో ఉంటుందన్నారు. సిమెంట్ మార్కెట్లో కన్సాలిడేషన్: దేశంలో దక్షినాదిన మొత్తం వ్యవస్థాపక సామర్థ్యం 125 మిలియన్ టన్నులు కాగా అందులో 50%(56మిలియన్ టన్నులు) మాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు. సిమెంట్ కంపెనీల వ్యవస్థాపక సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి రావాలంటే మరికొంత సమయం పట్టివచ్చన్నారు. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా సిమెంట్ ధరలు పెరగకపోవడంతో ఓ మోస్తరు కంపెనీలకు కూడా మార్కెట్లో నిలదొక్కుకోవడం సవాలుగా మారుతోందన్నారు. దీంతో ఈ రంగంలో మరిన్ని కొనుగోళ్లు, విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ పోకడలు సూచిస్తున్నాయన్నారు. ఫార్మాలోకి వస్తున్నారా? సిమెంట్ రంగ దిగ్గజం సాగర్ సిమెంట్స్ ఫార్మా వ్యాపారంలోకి అడుగిడనుందా? హైదరాబాద్‌లో 30 వేల కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఫార్మా సిటీలో యూనిట్ నెలకొల్పే యోచన చేస్తోందా? ఇటీవల ఫార్మా సిటీ స్థల ఎంపిక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఏరియల్ సర్వేలో ఫార్మా సంస్థల దిగ్గజాలతో కలిసి సాగర్ సిమెంట్స్ జేఎండీ ఆనంద రెడ్డి పాల్గొనటం పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయమై ఆయనతో ప్రస్తావించగా...‘‘మా ప్రధాన వ్యాపారం సిమెంట్. అదే మా కోర్ కాంపిటెన్సీ. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు కాని, భవిష్యత్తులో పెట్టుబడికి ప్రతిఫలం అందించే పరిశ్రమల్లో ప్రవేశించాలన్నదే మా అభిలాష’’ అన్నారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పారు. వికాట్ సాగర్ సిమెంట్ జాయింట్ వెంచర్లో తన వాటా 47 శాతం ఫ్రెంచి సంస్థ వికాట్‌కు 2014లో రూ. 435 కోట్లకు సాగర్ విక్రయించింది. ఈ మొత్తాన్ని కొత్త వ్యాపారా అవకాశాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఇంతకుముందే ప్రకటించింది. ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో అధికాదాయ మార్గాలపై సాగర్ సిమెంట్స్ దృష్టి పెడుతోన్న విషయం స్పష్టం అవుతోంది. -
72 ఏళ్ల వయసులో అద్భుత విన్యాసం
కనగానపల్లి: వృద్ధుడు చేసిన బైకు విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన ఆనందరెడ్డి (72) చేతులు వదలిపెట్టి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బైకు నడిపారు. 25 నిమిషాలలో 36 కి.మీ దూరం చేరుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని మరూరు టోల్గేట్ వద్ద ఆదివారం ఉదయం 9.25 గంటలకు ప్రారంభమై పెనుకొండ సమీపంలోని గుట్టూరు క్రాసింగ్ వరకు కొనసాగింది. ఆనందరెడ్డి బైకు ఎక్స్‌లేటర్‌ను 85 కి.మీ (ఫిక్స్డ్) వేగం మీద పెట్టుకొని, హ్యాండిల్‌ను వదలిపెట్టి ట్రాఫిక్ మధ్యలో సైతం ఎక్కడా తడబడకుండా బైకు నడిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాందించేందుకే తాను ఈ సాహసం చేశానని ఆనందరెడ్డి తెలిపారు. తాను 1963 నుంచి 1970 వరకు ఆర్మీలో పనిచేశానని చెప్పారు. గతంలో ఉన్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును ( 25 కి.మీ దూరాన్ని 23.54 నిమిషాలలో) అధిగమించాలన్న ఉద్దేశంతో ఈ విన్యాసం చేశానన్నారు.