ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని.. | lover commit to suicide | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్యాయత్నం

Published Tue, Jan 23 2018 6:42 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

lover commit to suicide - Sakshi

అన్నానగర్‌: ప్రియుడు తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన చెన్నైలో ఆదివారం జరిగింది. ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో అతని వివాహం నిలిచిపోయింది. వివరాలు.. చెన్నై సైదాపేట జోన్స్‌ రోడ్డుకు చెందిన యువతి (25). ఈమె ఐఏఎస్‌ శిక్షణ పొందుతోంది. ఆమెతో పాటు శిక్షణలోఉన్న సత్యమూర్తి (27)ని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి వివాహాన్ని సత్యమూర్తి కుటుంబీకులు వ్యతిరేకించారు. ఈ స్థితిలో సత్యమూర్తి ప్రియురాలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.

వేలూర్‌ సమీపంలోని మురుగన్‌ ఆలయంలో గత 19న వివాహానికి యువతి, ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటుచేసుకున్నారు. అయితే సత్యమూర్తి అక్కడికి రాలేదు. దీంతో  మనస్తాపం చెందిన యువతి చెన్నై వచ్చింది. ఈ స్థితిలో సత్యమూర్తి శనివారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి తనకు మరొకరితో వివాహం నిశ్చయమైందని తెలిపి ఆహ్వానపత్రిక ఇచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి బ్లెడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబసభ్యులు మైలాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. ఫిర్యాదు అందుకున్న కుమరన్‌నగర్‌ పోలీసులు సత్యమూర్తిని ఆదివారం సత్యమూర్తిని అరెస్టు చేశారు. దీంతో మదురైలో సోమవారం జరగాల్సిన సత్యమూర్తి వివాహం ఆగిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement