కర్ణాటక , బనశంకరి:ప్రియురాలితో కలిసి బైక్‌ల అపహరణకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.6.15 లక్షల విలువైన పది బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఆగ్నేయ విభాగం డీసీపీ బోరలింగయ్య తెలిపారు. కోరమంగల పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బైక్ అపహరణలు తీవ్రతరం కావడంతో మడివాళ ఉపవిభాగ అసిస్టెంట్ కమిషనర్ సోమేగౌడ నేతృత్వంలో సీఐ మంజునాథ్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం గురువారం బొమ్మనహళ్లి హొసపాళ్యకు చెందిన కార్తీక్‌ను అరెస్ట్ చేసి పది బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఓ ప్రియురాలు ఉంది. ఆమెకు బైక్‌లు అంటే ఇష్టం. దీంతో ఆమెను మెప్పించటానికి ఇతను బైక్‌లు అపహరణకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని విక్రయించి ఆ డబ్బుతో ఇద్దరు జల్సా చేసేవారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment