భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో ఓ పెయింట్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోషిణి ఘర్ రోడ్డులోని ఇండర్జన్ మార్కెట్ వద్ద ఓ పెయింట్ దుకాణంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. షాపులోని పెయింట్లు అంటుకొని మంటలు అన్నివైపులా విస్తరించడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గ్వాలియర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సత్యేంద్రసింగ్ తోమర్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
చదవండి: ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!
భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం
Published Mon, May 18 2020 3:56 PM | Last Updated on Mon, May 18 2020 4:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment