యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి | Man Attacks girl in Eluru | Sakshi
Sakshi News home page

యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

Published Sat, Oct 6 2018 2:21 PM | Last Updated on Sat, Oct 6 2018 4:52 PM

Man Attacks girl in Eluru - Sakshi

అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి దిగాడు.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో ఇష్టానుసారంగా  ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తమవడంతో, అప్పటికే కత్తిపోట్లు పడ్డ యువతికి ప్రాణాపాయస్థితి తప్పింది. ప్రస్తుతం నిందితుడు దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

స్థానికంగా ఉన్న ఓ వస్త్రదుకాణంలో దిలీప్‌, బాధితురాలు పని చేసేవారు. ఇటీవలే ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పడంతో యువతి నిరాకరించింది. అప్పటి నుంచి ఆమెను వెంటాడుతూ వేధించడం ప్రారంభించాడు. శనివారం మరింతగా రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా చస్తావా అంటూ యువతిని అడ్డుకున్నాడు. ఆమె నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. స్థానికులు దిలీప్‌ను అడ్డుకుని యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దిలీప్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement