ఈశ్వరరావు (ఫైల్)
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యలమంచిలి ఈశ్వరరావు (61) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన.. ఇటీవలే ధర్మారం (బి) శివారులో హార్టెస్వర్ సర్వీస్ షాపు ప్రారంభించాడు.
అయితే, కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు సుమారు ఆర్నెల్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. అయినప్పటికీ ఇటీవల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తితో ఇంటి వరండాలో గల ఉయ్యాల కొక్కానికి తాడుతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందారు.
‘రియల్’ కారణం ?
ఈశ్వరరావు చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. హార్వెస్టర్ షాపును ప్రారంభించిన ఆయన ఇటీవలే దాన్ని ఇతరులకు ఇచ్చి వేశారు. భూములపై పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడం, అప్పులు పెరిగి పోవడం, బైపాస్ సర్జరీ ఇలా అన్ని రకాలుగా ఒత్తిడి పెరగ డంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment