కూచిపూడి (పామర్రు) : తండ్రి దినం కబురు బంధువులకు చెప్పేందుకు బైక్‌పై వస్తుండగా రోడ్డుపై పని చేస్తున్న జేసీబీ తొట్టి (ముందు భాగం) తగలటంతో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. కూచిపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పామర్రు శివారు చాట్లవానిపురానికి చెందిన గండ్రపు కళ్యాణబాబు (19) తన తండ్రి ఇటీవల మరణించటంతో దినం కబురు చెప్పే క్రమంలో మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలోని బంధువుల వద్దకు బైక్‌పై వస్తున్నాడు. కారకంపాడు, చినముత్తేవి గ్రామాల మధ్యలో బుధవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో రోడ్డు ఎడమ వైపు పని చేస్తున్న జేసీబీ తొట్టి తగిలింది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. 108లో బందరు ప్రభుత్వ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ జె వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment