సాక్షి, అనంతపురం : ఓ వ్యక్తి బొమ్మ తుపాకీని చూపించి బ్యాంకులో దోపిడీకి యత్నించాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరూర్ వైశ్య బ్యాంకులో చోటుచేసుకుంది. బ్యాంకులో ఉన్న వారు అప్రమత్తమై దోపిడీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. తీరా అతని చేతిలో ఉంది బొమ్మతుపాకీ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. బొమ్మతుపాకీ కొనుక్కొచ్చి దోపిడీకి స్కెచ్ వేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. దుండగుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment