
మృతురాలు మాధవి
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న ప్రతాప్ భార్య మాధవి (26) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న మాధవి భర్తతో గొడవ పడి మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి తెలిపారు.