
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. నవాబ్‌గంజ్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు సోమవారం తన స్నేహితుడు సిద్ధార్ధ్ ద్వివేదిని కలిసేందుకు వెళ్లగా ద్వివేది తన స్నేహితులు తివారి, పవన్‌తో కలిసి ఆమెను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
తీవ్రంగా గాయపడిన బాధిత బాలికను ఘటనా స్థలంలోనే వదిలివేసి పరారయ్యారు. బాధితురాలిని గుర్తించిన స్ధానికులు ఆస్పత్రికి తరలించారని ఎస్‌పీ సంజీవ్ శరణ్ తెలిపారు. నిందితులపై పోస్కో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితులు గంగాహట్, ఉన్నావ్‌కు చెందిన ద్వివేది, తివారీలను అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment