
చెన్నై, తిరువొత్తియూరు: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడడంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా సేద్దియతోపు ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల విద్యార్థిని అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటికి సమీపంలో నడచి వెళుతున్న విద్యార్థినిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు విద్యార్థినిని మరుగైన చోటుకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో చాలా సమయం వరకు విద్యార్థిని ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కుమార్తె కోసం గాలించగా ఓ ఆలయం వెనుక స్పృహతప్పి పడి ఉంది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లి విచారణ చేయగా మౌనం వహించిన విద్యార్థిని ఇంట్లో పంటలకు చల్లు క్రిమి సంహారక మందు తాగి స్పృహ తప్పింది. దీంతో తల్లిదండ్రులు కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికకు స్పృహ వచ్చిన తరువాత తల్లిదండ్రులు విచారణ చేయగా యువకుడు లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసింది.
నిందితుడి అరెస్ట్
దీనిపై ఫిర్యాదు అందుకున్న సేద్దియతోపు మహిళా పోలీసుస్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన తిలకర్, అతని స్నేహితుడు జయశంకర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment