మోసం కేసులో దర్శకుడు అరెస్ట్‌ | Movie Director Arrest in Cheating Case | Sakshi
Sakshi News home page

మోసం కేసులో దర్శకుడు అరెస్ట్‌

Mar 2 2019 11:24 AM | Updated on Mar 2 2019 11:24 AM

Movie Director Arrest in Cheating Case - Sakshi

రాంకీ రామకృష్ణన్‌

నగదు మోసం కేసులో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీ సులు అరెస్ట్‌ చేసి పుళళ్‌ జైలుకు తరలించారు.

పెరంబూరు: నగదు మోసం కేసులో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీ సులు అరెస్ట్‌ చేసి పుళళ్‌ జైలుకు తరలించారు. కమరకట్టు అనే చిత్ర దర్శకుడు రాంకీ రామకృష్ణన్‌. ఈయన నర్తకి చిత్ర దర్శకురాలు  విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్‌లతో కలిసి ఇదయం తిరైయరంగం అనే చిత్ర నిర్మాణం చేపట్టారు. అందుకుగానూ షావుకార్‌పేటకు చెందిన అశోక్‌ అనే ఫైనాన్షియర్‌ వద్ద రుణం తీసుకున్నారు.

అందుకు బుదులుగా ఆస్తుల పట్టాలను కుదవ పెట్టారు. అయితే చెప్పిన తేదీకి తీసుకున్న నగదు రూ.4.60 లక్షలు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్‌ అశోక్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు రాంకీ రామకృష్ణన్,  విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్‌లను బుధవారం అరెస్ట్‌ చేసి పుళళ్‌ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement