రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌  | New Twist In Hero Raj Tarun Car Accident Case | Sakshi
Sakshi News home page

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

Published Fri, Aug 23 2019 2:21 AM | Last Updated on Fri, Aug 23 2019 10:40 AM

New Twist In Hero Raj Tarun Car Accident Case - Sakshi

గచ్చిబౌలి : సినీ హీరో రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసు మరో మలుపు తిరిగింది. యాక్సిడెంట్‌ వీడియోలు మీడియాకు ఇస్తానని డిజైనర్‌ కార్తీక్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడని రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ రాజా రవీంద్ర గురు వారం మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న కార్తీక్‌ అనే వ్యక్తి తనకు కాల్‌ చేసి రాజ్‌ తరుణ్‌కు సంబంధించిన ఒక వీడియో తన వద్ద ఉందని చెప్పాడని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడని తెలిపారు. గురు వారం ఓ టీవీ చానల్‌ను ఆశ్రయించిన కార్తీక్‌.. వీడియోలు తీసివేయాలని తాము బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డామని ఆరోపించడంలో నిజం లేదన్నారు. తనకు, రాజ్‌ తరుణ్‌కు,సినీ పరిశ్రమ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన కార్తీక్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాజా రవీంద్ర ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 20న నార్సింగి పీఎస్‌ పరిధిలో రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌ కారు దిగి పరిగెత్తుతుండగా కార్తీక్‌ చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలు మీడియాలో వైరల్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement