మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి (ఇన్‌సెట్) చంద్రశేఖర్ (పాత చిత్రం)
సబ్బవరం/పెందుర్తి: సబ్బవరం సమీపంలో ఓ పాతనేరస్తుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి సమీపంలో బొర్రమ్మగెడ్డకు కొద్దిదూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హతుడు 15 చోరీ కేసుల్లో నిందితుడు కాగా... ఇటీవల హతుడికి సంబంధించిన విలువైన స్థలంపై వివాదం నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ హత్యాకాండ మిస్టరీగానే ఉంది. స్థానికులు, పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సబ్బవరం బర్మాకాలనీ(దుర్గానగర్)లో కోన చంద్రశేఖర్(26) ఉంటున్నా డు. ఇతని తల్లిదండ్రులు మరణించగా నలు గురు అక్కలు ఉన్నారు. చంద్రశేఖర్ వ్యసనాల కు బానిస కావడంతో దొంగతనాల బాటపట్టాడు. ఈ క్రమంలో ఇతడిపై సబ్బవరం, పెందుర్తి, గాజువాక, నగరంతోపాటు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో 15 చోరీ కేసులు ఉన్నా యి.
కొన్నాళ్ల క్రితమే ఇతడిపై సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో డీసీ షీట్ ఓపెన్ చేశారు. చంద్రశేఖర్ ఎప్పుడూ ఇంటిపట్టున ఉండడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సబ్బవరం సమీపంలోని ఓ దాబాలో తలదాచుకునేవాడు. ఆదివారం రాత్రి కూడా దాబాకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. మంగళవారం ఉదయం కొందరు రైతులు ఇటుగా రావడంతో ఘటన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న అనకాపల్లి డివిజన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ జి.రామచంద్రరావు, సబ్బవరం ఎస్‌ఐ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి ఆధారాల కోసం శోధించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.
సెల్‌ఫోన్‌లోనే మిస్టరీ !
హతుడు చంద్రశేఖర్‌కు జిల్లాతోపాటు నగరంలోని పలువురి నేరస్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఎల్లమ్మతోట, బర్మా కాలనీ ప్రాంతాల్లోని కొందరితో స్క్రాప్ దొంగతనాలతోపాటు చోరీలకు పా ల్పడుతుండేవాడని తెలుస్తోంది. మరోవైపు మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులతో కూడా చంద్రశేఖర్ గతంలో వివాదాలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన విలువైన స్థలం సబ్బవరం నడిబొడ్డున ఉం ది. దాన్ని విక్రయించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా చంద్రశేఖర్ అడ్డుపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దొంగతనాల్లో సొత్తు పంపకంలో తేడాలు వచ్చి హత్య జరి గిందా... మరే ఇతర కారణాలతో ఇతడిని హ తమార్చారా అన్న కోణాల్లో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో మృతుడి సెల్‌ఫోన్‌తో పాటు ఏటీఎం కార్డు, ఓటరు కార్డు, మద్యం సీసాలు, చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని కాల్‌డేటా ద్వారా నిందితుల ఆచూకీ తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఆనందపురం – అనకాపల్లి బైపాస్ రహదారి నుంచి దాదాపు 30మీటర్లు ఉన్న ఘట నా స్థలానికి ఆటో చక్రాల చారలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఆటోలో ఇక్కడికి వచ్చిన దుండగులు మందు పార్టీ చేసుకున్న తర్వాత చంద్రశేఖర్‌ను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment